|
|
Articles: Recipes | థం బిర్యాని - Ms. sandya arra
| |
కావలసిన పదార్ధాలు :
ఒక కిలో బాస్మతి బియ్యం
నాలుగు ఉల్లిగడ్డలు
ఆరు పచ్చి మిర్చి
మూడు పుదీనా కట్టలు
అర కిలో చికెన్
ఒక కొత్తిమీర కట్ట
మూడు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్
మూడు టీ స్పూన్స్ ధనియాలపొడి
ఆరు లవంగాలు, పట్టా
రెండు టీ స్పూన్స్ సాజిర
నాలుగు యాలకులు
బిర్యాని ఆకు
పది టీ స్పూన్స్ కాచిన నెయ్యి లేదా డాల్డా
రెండు కప్పుల చిక్కటి పెరుగు
ఫుడ్ కలర్
పది నిమ్మపండ్ల రసం
ఉప్పు, కారం తగినంత
తయారు చేసే విధానం :
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి దానిలో ఉప్పు , కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పెరుగుతో కలపాలి. తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో ఈ మిశ్రామాన్ని ఉంచాలి. ఇప్పుడు సన్నగా తురిమిన ఉల్లిపాయలను నెయ్యిలో గాని డాల్డాలో గాని వేయించాలి. అవి బంగారు రంగులో వచ్చిన తరువాత ఈ మిశ్రమం పైన వేయాలి. పచ్చి మిర్చి, పుదీనా ఆకులు కూడా వేసి గంటసేపు మూత పెట్టి నానబెట్టాలి. ఇది నానేలోపు మనం బాస్మతి బియ్యంలో రెండు గ్లాసుల నీరు తక్కువగా పోసి దానిలో సాజిర, బిర్యాని ఆకు, ఉప్పు వేసి అన్నం వండాలి. ఇది పలుకు మీద ఉన్నప్పుడు నీరు ఇంకిపోయేవరకు చిన్న మంట మీద పెట్టి దించేయాలి.
ఒక గంట సేపటి తరువాత నానిన చికెన్ లో ఈ అన్నాన్ని పైన సమానంగా వేసి మధ్యలో గీత పెట్టి ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు తీసుకొని దానిలో చిటెకెడు ఫుడ్ కలర్ కలపాలి. ఇది పసుపు రంగులోకి వస్తుంది. ఈ రంగుని అన్నం చుట్టుతా వేసి గీత మధ్యలో వేయాలి. ఇప్పుడు నిమ్మరసం కూడా పోసి నిండుగా మూతపెట్టి దాని చుట్టూ కొద్దిగా గోధుమపిండి పూరీపిండిలా కలిపి గిన్నె చుట్టూ పెట్టాలి. లేదా ఆవిరి బయటకి పోకుండా మూత పై బరువు పెట్టాలి. ఇప్పుడు చిన్న మంట మీద ఆవిరికి కేవలం ఇరవై నిమిషాలు పెట్టి దించేయాలి. ఇలా చేయడం వల్ల అడుగున ఉన్న చికెన్ ఉడుకుతుంది. పలుకు మీద ఉన్న అన్నం మెత్తబడకుండా పుల్లల్లాగా అవుతుంది. ఫుడ్ కలరు అన్నం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ అన్నం చల్లరాక ఒక వెడల్పాటి పెద్ద గిన్నె తీసుకొని ఈ వండిన అన్నాన్ని ఆ గిన్నెలోనికి మార్చాలి. ఇప్పుడు అన్నం చికెన్ కలిసేటట్టుగా మెల్లిగా కలపాలి.
చివరిగా కొత్తిమీర చల్లి దీనిని పెరుగు పచ్చడి గాని నాన్ వెజ్ కర్రీతో గాని కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|