|
|
Articles: Devotion | సద్గురు సాయి లీలలు - Site Administrator
| |
(పి. కృష్ణ)
సాయి భక్తులకు నా యొక్క విన్నపము. నా అనుభవం ద్వారా సాయి లీలను తెలియజేస్తున్నాను. నేను మరియు ఎల్.సత్యనారాయణ సెక్రటరిగారు బాగ్ అంబర్ పేటలో నిర్మించనున్నబాబా మందిరమునకు మొట్టమొదటి సాయి సేవకులము. కాని ఈ సత్ సంకల్పము బాబా మొట్టమొదట సత్యనారాయణ గారి మనస్సులో చొచ్చి, ఈ మందిరాన్ని నిర్మించాలనే సంకల్పం బాబా కల్పించారు. తరువాత అతనితో నేను కల్సి స్థలము కొనుగోలు మొదలుకొని నేటి వరకు మందిరము నిర్మాణ కార్యక్రమంతో మేము ఇద్దరం బాబాకు సేవచేసే అవకాశం లభించినందుకు ఈ జన్మసార్థకం అయ్యిందని అనుకుంటాము. ఎందుకంటే మనిషి ఉదయం లేచింది మొదలు సాయంత్రము వరకు తన స్వార్థం కొరకు ప్రయత్నిస్తాడు, కాని ఈ యొక్క బాబా మందిరం పదిమందికి ఉపయోగపడే విధంగా తరతరాలుగా వెలిగే దీపం అని నా ఉద్దేశం.
1991 సంవత్సరంలో ఈ మందిర నిర్మాణమునకై సత్యనారాయణగారి మనస్సులో స్థలం అన్వేషణ తలంపుకలిగినది. అందుకుగాను శ్రీనివాస్ (బి.హెచ్.ఇ.యల్) ద్వారా ఈ స్థల కుటుంబ సభ్యులతో సంప్రదించాలనే కోరిక మాలో కలిగినది. వారు ఎవరు మాట వింటారు అనేది మొట్టమొదట విషయం. ఎందుకంటే ఈ మందిరం నిర్మించాలంటే ఇది మామూలు విషయం కాదు, డబ్బుతో కూడిన పని. అయినా బాబా సంకల్పము ఉంటే ఎంతటి కష్ట సాధ్యమైన పని అయినా సులభంగా ఆ కార్యక్రమం నెరవేరుతుందని నా ఉద్దేశం. అంతలో స్థల కుటుంబంవారికి రాజు ఇబ్రహిం బాగ్ గారికి దగ్గర అని తెల్సినది.
నేను, సత్యనారాయణ కలసి ఒకరోజు ఇబ్రహిం బాగ్ వెళ్ళాము. రాజు గారిని కలిసి విషయాన్ని తెల్పము. వెంటనే రాజుగారు స్థలం వాళ్ళను పిలిపించి వీరు (మేము) బాబా మందిరాన్ని నిర్మించాలి అనుకుంటున్నాము అందుకు మీరు ఈ స్థలం మాకు ఇవ్వాలని అంటే, వారు వెంటనే ఈ వ్యవహారం మీరే నడిపించాలి అన్నారు. అందుకు రాజుగారు, అంతా బాబా చూసుకుంటారు. ఏది ఏమైనా మేము వెనుకాడము అన్నారు. రాజుగారిని మేము ఈ గుడికి ఛైర్మన్ గా నిర్ణయించి వారి సారధ్యంలో ఈ కార్యక్రమములో నిమగ్నం అయినాము.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|