|
|
Articles: TP Features | హెడ్లీ చిన్నప్పట్నించీ అంతే! - Site Administrator
| |
(సాకేత సవ్యసాచి)
హెడ్లీ... ఇప్పుడు ప్రపంచ సంచలనం. భారత్ లో హింసాత్మక చర్యలకు ప్రణాళిలు రచించిన వాడిగా మీడియాలో కథనాలు. అదిగో అతని జీవిత ప్రస్తానం స్థూలంగా ఇదే. పాకిస్తాన్ లో కఠినంగా వ్యవహరించే బోర్డింగ్ స్కూల్ నుంచి అమెరికా ఫిలడెల్ఫియాలోని నీతి నియమాలు పాటించని బార్ వరకు సాగిన ప్రస్థానం డేవిడ్ హెడ్లీ జీవితాన్ని నిర్వచించిందని ప్రపంచ స్థాయిలో ఉగ్రవాదంపై దర్యాప్తు సాగిస్తున్న సంస్థలో ఆ మధ్య వయస్కుని గురించి తెలిసినవారు అంటున్నారు. పాకిస్తాన్ లో తన తండ్రి చేతుల్లో పవిత్ర భావాలున్న ముస్లింగా పెరిగిన హెడ్లీ తన అమెరికన్ తల్లితో కలసి నివసించేందుకై 17వ ఏట అమెరికాకు తిరిగి చేరుకున్నాడు. అతని తల్లి ఖైబర్ పాస్ అనే బార్ ను నడిపేది.
హెడ్లీ ఇప్పుడు ఇస్లామిక్ మత ఛాందసవాది. అతనికి సాంప్రదాయక పాకిస్తానీ భార్య ఉంది. ఆమె తమ పిల్లలతో కలసి షికాగోలో నివసిస్తుంటుంది. అయితే, అతనికి ఒక అమెరికన్ స్నేహితురాలు కూడా ఉందని, ఆమె న్యూయార్క్ లో మేకప్ కళాకారిణి అని ఒక బంధువు, మిత్రులు చెప్పారు. సందర్భాన్ని బట్టి అతను అమెరికాలో తాను పెట్టుకున్న పేరు డేవిడ్ హెడ్లీగాను, తనకు జనన సమయంలో పెట్టిన పేరు దావూద్ గిలానీగాను వ్యవహరిస్తుంటాడు. చివరకు అతని కళ్లు కూడా అతని మూలాలను సూచిస్తుంటాయి. ఒక కన్ను గోధుమ వర్ణంలోను, రెండవది ఆకుపచ్చ రంగులోను ఉంటాయి.
మహమ్మద్ ప్రవక్త పై కార్టూన్లు ప్రచురించిన డెన్మార్క్ వార్తాపత్రికపై కక్ష తీర్చుకోవడానికి పథకం వేస్తున్న తీవ్రవాదుల గ్రూపులో ప్రధాన వ్యక్తిగా అమెరికన్ పౌరుడైన హెడ్లీపై ఆరోపణ వచ్చింది. అతనిపై మోపిన అభియోగాలు భిన్న ప్రపంచాల మధ్య సులభంగా సంచరిస్తుండే వ్యక్తిగా అతనిని చిత్రిస్తున్నాయి. అయితే, హెడ్లీని అరెస్టు చేసినప్పటి నుంచి అతని గురించి తెలియవచ్చిన వివరాలను బట్టి రెండు సంస్కృతుల మధ్య డోలాయమాన స్థితిని అతను ఎదుర్కొన్నాడని, చివరికి ఇస్లామిక్ తీవ్రవాదంవైపు అతను మొగ్గాడని విదితమవుతున్నది.
'మనలో కొందరు 'ఉగ్రవాదాన్ని' పిరికివారి ఆయుధంగా పేర్కొంటున్నారు' అని హెడ్లీ గత ఫిబ్రవరిలో తన హైస్కూలు సహచరులకు పంపిన ఇమెయిల్ సందేశంలో రాశాడు. 'ఆటవికమైనదనండి లేదా అనైతికమనండి లేదా క్రూరమైనదనండి కాని అది పిరికితనంతో కూడుకున్నది కాదని నేను చెప్పగలను' అని అతను పేర్కొన్నాడు. 'మొత్తంగా సాహసం ముస్లిం దేశానికి ప్రత్యేక లక్షణం' అని అతను పేర్కొన్నాడు. హెడ్లీపైన, అతని తోటి కుట్రదారు తహవ్వుర్ హుస్సేన్ రాణాపైన ప్రభుత్వం పెట్టిన కేసులో చూపుతున్న సాక్ష్యాధారాలలో అతని ఇ-మెయిల్ సందేశాలు కూడా ఉన్నాయి. వాటిలో తలలు నరకడాన్ని, ఆత్మాహుతి బాంబు దాడులను ధీరోదాత్త చర్యలుగా సమర్థిస్తున్న సందేశాలు వాటిలో చాలా ఉన్నాయి. పాకిస్తాన్ లో జన్మించి కెనడా పౌరసత్వం స్వీకరించిన రాణాకు షికాగోలో వ్యాపార సంస్థలు ఉన్నాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|