|
|
Articles: My Thoughts | వైద్య గురు ధన్వంతరి - Miss rajeswari rajeswarinedunuri
| |
సాగర గర్భంనుండి ఒక పురుషుడు.. పీతాంబరుడు.. మణి కుండలాలు ధరించి పుష్ప మాలాలంకృతుడై పీనాయుత బాహు దండములు పద్మారుణ లోచనములు కంచు కంఠం విశాల వక్ష ప్రదేశము కలిగిన వాడై నీల గాత్ర తేజాన్ని సుసిన్నగ్ధ కేశజాలాన్ని కలిగి హస్త తలాన అమృతకలశాన్ని ధరించిన వాడై ఆవిర్భ వించాడని, అతను విష్ణు అంశవలన పుట్టిన వాడని, యజ్ఞ భాగ భోజుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడు, అని బ్రహ్మాదులు గ్రహించి అతనికి 'ధన్వంతరి' అని పేరు పెట్టారని వర్ణించ బడినది.
ఐతే భాగవతంలోని నవమ స్కంధములో కాశీ రాజు ధన్వంతరి గురించి పురూరవ వంశ క్రమంలో పురూరవునికి క్షతవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశీ, కాశీకి దీర్ఘతపుడు, ఆ దీర్ఘతపునికి ధన్వంతరి జన్మించారని.. హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడని ప్రతీతి. ఇదే వంశ క్రమము విష్ణు పురాణంలో కుడా ఉన్నది. ధన్వంతరికి మూడవ తరం వాడు ఆ దివోదాసుడే ధన్వంతరి. ఇతడు ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది (అష్టాంగాలుగా) భాగాలుగా విభజించాడు. అవి. 1.కాయ చికిత్స, 2.కౌమార బౄత్య లేదా బాల చికిత్స, 3. భూత వైద్య లేదా గ్రహ చికిత్స, 4.శలాక్య తంత్ర, 5.శల్య తంత్ర, 6.విష తంత్ర, 7.రసాయన తంత్ర, 8.వశీకరణ తంత్ర అని ఎనిమిది భాగాలు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|