|
|
Articles: Festivals | గణేశ్ మహరాజ్ కీ జై - Site Administrator
| |
గంగిరెద్దును బ్రహ్మాండంగా ఆడిస్తుండగా గజాసురుండు విని వారిని తన వద్దకు పిలిపించుకున్నాడు. తన భవనం వద్ద కూడా గంగిరెద్దును ఆడించాలని ఆజ్ఞాపించాడు. బ్రహ్మాది దేవతలు వాద్యాలను పోటీ పడి మరీ గజాసురుణ్ణి ఆనందింపచేశారు. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు ఆనందంతో 'మీకేమి కావాలో కోరుకోండి ఇస్తాను' అన్నాడు. హరి వాని వద్దకు వెళ్ళి, 'ఇది శివుని వాహనం నంది ', శివుని వెదికేందుకు వచ్చింది. కాబట్టి శివుని ఇచ్చివేయి' అన్నాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయి, అతనిని రాక్షసాంతకుడైన శ్రీహరిగా గుర్తించి, తనకు మరణమే నిశ్చయం అనుకొని తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని 'నా శిరస్సు త్రిలోక పూజ్యంగా చేసి, నా చర్మం నీవు ధరించు' అ ప్రార్ధించి విష్ణుమూర్తికి అంగీకారం దెలిపాడు. నందిని ప్రేరేపించాడు. నంది తన కొమ్ముతో గజాసురుని పొట్టలను చీల్చి సంహరించింది. శివుడు గజాసుర గర్భం నుండి బయటికి వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. 'దుష్టాత్ములకు ఇలాంటి వరాలు ఇవ్వకూడదు. ఇస్తే పాముకు పాలు పోసినట్లు అవుతుంద'ని ఉపదేశించి బ్రహ్మ ఇతర దేవతలను వీడ్కోలు పలికి తాను వైకుంఠానికి వెళ్ళాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి వేగంగా వెళ్ళాడు.
వినాయక జననం :
భర్త శంకరుడు వస్తున్న విషయం కైలాసంలో పార్వతీదేవి విని సంతోషంతో అభ్యంగన స్నానం చేస్తూ నలుగుపిండిని ఒక బాలునిగా చేసి, ప్రాణం పోసి, వాకిలి ద్వారం వద్ద కాపలా ఉంచింది. స్నానానంతరం పార్వతి సర్వాభరణాలు అలంకరించుకొంటూ పతి రాక కోసం నిరీక్షిస్తోంది. అపుడు పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా వాకిలి ద్వారం ఉన్న బాలుడు అడ్డగించాడు. శివుడు కోపించి త్రిశూలంతో బాలుని కంఠం నరికి లోనికి వెళ్ళాడు.
భర్తను చూసిన పార్వతీదేవి ఎదురెళ్ళి, అర్ఘ్య పాద్యాదులతో పూజించింది. వారిరువురూ ఆనందంతో ముచ్చటించుకుంటుండగా గుమ్మం వద్ద బాలుని సంహరించిన విషయం ప్రస్తావనకు వచ్చింది. తాను చేసిన పనికి చింతించి, తన వెంట తెచ్చిన గజాసుర శిరస్తును బాలునికి అతికించి ప్రాణంబ పోసి, 'గజాననుడు' అని పేరుపెట్టాడు. అతనిని పుత్ర ప్రేమతో ఉమామహేశ్వరులు పెంచుకొంటున్నారు. గజాననుడు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవిస్తున్నాడు. తాను సులభంగా ఎక్కి తిరిగేందుకు అనింద్యుడు అనే ఒక ఎలుక రాజును వాహనంగా చేసుకొన్నాడు.
కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా బలశాలి. అతని వాహనం నెమలి. అతడు దేవతల సేనా నాయకుడై ప్రసిద్ధి చెందాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|