|
|
Articles: Devotion | ఒకటికి పది రెట్లు - Mr. Pratap Cherukuri Pratap
| |
శిరిడీ వచ్చినప్పుడల్లా సాయి నానా చందోర్కర్ వద్ద నుండి అనేక సార్లు దక్షిణ అడుగుతుండడంతో చందోర్కర్ ఒక ఉపాయం ఆలోచించాడు. కోపర్గావ్ లో తన మిత్రుని వద్ద సగం డబ్బు వుంచి మిగితా డబ్బుతో శిరిడీ రావడం ప్రారంభించాడు. పైగా సాటి సాయి భక్తులతో 'సాయి కోరినప్పుడల్లా దక్షిణ ఇవ్వడం మన కర్తవ్యం. అందుకే డబ్బు అయిపోకుండా ఈ ఏర్పాటు చేసానని' గొప్పలు చెప్పడం ప్రారంభించాడు. సాయి భక్తులందరూ చందోర్కర్ తెలివి తేటలను ప్రశంసించారు. ఒకసారి శ్రీ సాయి అతనిని పిలిపించి మూడు దఫాలుగా అతని వద్ద నున్న డబ్బంతటినీ దక్షిణ కింద తీసేసుకున్నారు. చందోర్కర్ కోపర్గావ్ కు మనిషిని పంపించే లోపలే అతనిని పిలిచి మళ్ళీ దక్షిణ అడిగారు సాయి. డబ్బు లేకపోవడంతో చందోర్కర్ చిన్న బుచ్చుకున్నాడు. అప్పుడు సాయి చిరునవ్వుతో అతనికి హితబోధ చేసారు' నేను కోరేది నీ వద్ద నున్న ధనం కాదు! అరిషడ్వర్గాలను విడిచి సర్వశ్య సరణాగతి ఒనరించితే నీ సర్వ బాధ్యతలు నావే! నీ భక్తి ఇంకా నిశ్చలం కాలేదు. ముందు నీ అహంభావాలను యుక్తిని తొలగించుకో. తెలివి తేటలు, ఉపాయాల కంటే గురువు పై భక్తి ముఖ్యం. సిరి సంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే వున్నాయి. కేవలం ఐహికపరమైన సుఖాల కోసం వాటిని వెచ్చిస్తే అవి వ్యర్ధమే . దానం అనే సత్కార్యం ద్వారా అమితమైన పుణ్యాన్ని సముపార్జించుకుంటారు.అవి ఉన్నతమైన ముందు జన్మలకు బాట వేస్తాయి. ఈ సిరి సంపదలన్నీ భగవంతుడిచ్చినవే! వాటిని తిరిగి ఆ భగవంతునికి సమర్పించుకోవడం వలన భక్తి, జ్ఞానాలు వృద్ధి పొందుతాయి. అతి విలువైన ఈ మానవ జన్మకు సార్ధకత చేకూరుతోంది.
సాయి చేసిన ఈ అద్భుతమైన, అసామాన్యమైన బాధ వలన చందోర్కర్ కే కాక అక్కడున్న భక్తుల హృదయాలలోని అజ్ఞానంధకారాలన్ని పటా పంచలు అయ్యాయి. జ్ఞాన బోధ గావించిన శ్రీ సాయికి కృతజ్ఞతలు అర్పించుకొని తిరిగి వారి ఇళ్ళకు వెళ్ళారు.
సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణ మస్తు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|