|
|
Articles: Short Stories | బాధ్యత - Mr. Devender Chintala Devender
| |
నా పని వత్తిడి వల్ల గుర్తుకు రాలేక పోతున్నారేమోలే అనుకుని ఆయన చెప్పినవన్నింటికి తలాడించేస్తున్నాను డూ డూ బసవన్నలా.
ఈ లోగా బస్సు లయబద్దంగా ఊగడం వల్ల కాబోలు నాక్కాస్త మగతగా వుండి నిద్రలోకి జారుకున్నాను.
సిరిసిల్ల వచ్చిన తర్వాత కండక్టర్ అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను. నానిద్ర మత్తు వదిలింది కండక్టర్ అరుపుతో.
మెల్లిగా పక్కకి చూశాను ఇందాక నాకు సీటిచ్చిన మనోహరనే నాకు గుర్తుకురాని చిన్ననాటి స్నేహితుడికై.
ఆశ్చర్యం. పక్కన మనోహర్ కనిపించలేదు కాని ఆయన వదిలేసిన బ్రీఫ్ కేసుంది. దానిపై అందంగా వ్రాసివుంది మనోహర్ అడ్రస్.
పాపం మరచిపోయుంటాడులే వెళ్ళి ఆయాన ఇంట్లో ఇచ్చేసి మా పెద్దమ్మఇంటికెల్దామనుకుని చూశాను అడ్రస్ వివరాలు బస్ దిగేసి.
కోర్ట్ వెనకాల అని ఇంటి నెంబరుంది. ఆశ్చర్యపోయాను. అవును మనోహర్ ఇప్పుడు గుర్తుకొచ్చాడు. అవును ఆయన నాచిన్ననాటి మిత్రుడే కాని మనోహర్ పోలికల్లేవు ఆయన ముఖంలో. సరే అనుకుని అటో తీసుకుని వెళ్ళాను మనోహర్ ఇంటికి. ఇంటి ముఖద్వారం మూసి వుంది. తట్టాను ద్వారాన్ని. కొద్దిసేపట్లో తెరచుకుని ఓ పాప వచ్చింది, ఏం కావాలన్నట్టుగా ప్రశ్నార్థకంగా. యాదృచ్చికంగా లోపలికి అడుగుపెట్టాను మనోహారంటూ. లోపలికి వెళ్ళాగానే ఆశ్చర్యపోయాను మనోహర్ ఫోటోకి దండ వేసి వుంది. నాకండ్లు ఎందుకో చెమర్చాయి ఆ ఫోటో చూసి. లోపలినుండి మనోహర్ భార్యవచ్చి నన్ను, నా చేతిలో వున్న బ్రీఫ్ కేసుని చూసి ఏడుస్తూ
’ఐదేళ్ళక్రితం బాకీవసూళ్ళకని పూనా వెళ్ళ్ల్లోస్తానని వెళ్ళిన ఆయన రైలు ప్రమాదంలో పోయారు. ఆయన వెళ్ళినప్పుడు ఇదే బ్రీఫ్ కేస్ తీసుకెళ్ళారంటూ' నాచేతిలోని బ్రీఫ్ కేసు తీసుకుని నాముందే తెరచింది. అంత దు:ఖంలోనూ ఆమె ఆశ్చర్యంతో ఆనందపడింది ఎందుకంటే బ్రీఫ్ కేసు నిండా కరేన్సీ నోట్లే. మనోహర్ చచ్చిపోయినప్పటికి తన బాధ్యతని తీర్చుకోవడానికి నన్ను పావుగా వాడుకున్న తీరు నన్ను కలచివేసినప్పటికీ ఓ రకంగా సంతోషాన్నిచ్చింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|