|
|
Articles: TP Features | 'ఉపా' సర్కార్ ఫీట్లు, పాట్లు! - Mrs. Aravinda Desai
| |
టెక్నాలజీని వాస్తవిక ప్రపంచం సమస్యలకు వర్తింపచేయాలనే సిబల్ ఉత్సుకత నుంచి కొన్ని ప్రాజెక్టులు ఆవిర్భవించాయి. ఉదాహరణకు - కోర్టులోసాక్షులు తమ వాఙ్మూలాలను వెనుకకు తీసుకునే అవకాశాలను తగ్గించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించడం, లేక పట్టణ కేంద్రాలలో నిఘా వేయడానికి సెక్యూరిటీ టెక్నాలజీలను ఉపయోగించడం. అయితే ఏ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రాజెక్టులను ఉద్దేశించారో అక్కడ వీటి ఫలితాలు ఇంకా వెలుగు చూడవలసి ఉంది.
ఆర్కిటిక్ మండలానికి మన దేశం నుంచి తొలి వైజ్ఞానిక యాత్రకు ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. కాని ఆ యాత్ర ద్వారా సాధించిన సైన్స్ ఫలితం విలువ ఏమిటో ఇంతవరకు స్పష్టంగా తెలియలేదు. 2005లో అంటార్కిటికాకు, 2008లో ఆర్కిటిక్ స్టేషన్ కు సిబల్ పర్యటనల వల్ల భారతీయ సైన్స్ కు కలిగిన ప్రయోజనం ఏమిటో కూడా తెలియడం లేదు. కాని 2004 - 09 కాలంలో సృష్టించిన లేదా ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు, విధానాలు, సంస్థల ఫలితాలు 2009 తరువాత అనుభవంలోకి రావచ్చు.
వైద్య, ఇంజనీరింగ్ కోర్సుల నుంచి సాలీనా రూ. 80 వేలు వరకు స్కాలర్ షిప్ లుగా ఇవ్వజూపడం ద్వారా ప్యూర్ సైన్స్ డిగ్రీల వైపు హైస్కూలు విద్యార్థుల దృష్టిని మళ్ళింపచేసేందుకు 'ఇన్ స్పైర్' (స్ఫూర్తి) పేరిట సైన్స్, టెక్నాలజీ శాఖ ఒక ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఉత్తమ విద్యార్థులలో కొందరినైనా ప్రొఫెషనల్ కోర్సులు లేదా మేనేజ్ మెంట్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల నుంచి మళ్ళించడానికి లేదా ఆ ధోరణిని మార్చడానికి ఈ ప్రణాళిక ప్రేరణ ఇచ్చిందా అనేది రానున్న ఐదు సంవత్సరాలలో లేదా అంతకుమించిన వ్యవధిలో స్పష్టం కావచ్చు.
| Be first to comment on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|