|
|
Articles: TP Features | 'తెలుగు'పై పార్టీల ప్రేమ! - Site Administrator
| |
తెలుగు భాషాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, తెలుగును సంప్రదాయ భాషగా అధ్యయనం చేయడానికి, తెలుగుభాషను అభివృద్ధి పరచేందుకు కృషిచేస్తాం. అలాగే పాలనా వ్యవహారాలలో తెలుగుభాషను ఉపయోగించేలా, పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధిని అందుకునేందుకు వీలుగా భాషను ఆధునికీకరించడానికి ప్రజారాజ్యం పార్టీ కృషి చేస్తుంది.
గ్రామ స్థాయి నుంచి సచివాలయం స్థాయి వరకు తెలుగును అధికారిక భాషగా అమలుపరుస్తాం
ప్రాచీన గ్రంథాలను ఆధునిక నుడికారంతో సిడిలుగా చేసి తక్కువ ధరలకు కొత్త తరాలకు అందుబాటులోకి తెచ్చి, వారు మన మూలాలను మరచిపోకుండా చేస్తాం.
కళాకారులు, రచయితలు, మేధావులతో స్వయంప్రతిపత్తి గల సాంస్కృతిక సంస్థలైన సంగీత అకాడమి, సాహిత్య అకాడమి, నాట్య అకాడమి వంటి సంస్థలను మళ్లీ ఆరంభించి, వాటి కార్యకలాపాలను విస్తృతం చేస్తాం.
5వ తరగతి వరకు తెలుగు భాషను మాధ్యమంగా పెడతాం. పాఠ్య గ్రంథాలలో నైతిక పాఠాలు, దేశభక్తి ఇతివృత్తాలు ఉండే విధంగా అన్ని తరగతుల పుస్తకాలను పునస్సమీక్షిస్తాం.
అంతేకాదు... ప్రైవేటు విద్యాసంస్థలను సమర్ధవంతంగా నియంత్రిస్తామని, అణగారిన వర్గాల వారికి ఈ సంస్థలలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రైవేటు పాఠశాలలతో దీటుగా పునర్య్వవస్థీకరిస్తామనీ, సామాజిక ప్రయోజనాన్ని విస్మరించి విద్యను వ్యాపారం చేసుకోవడానికి అనుమతించమని చెప్పింది. బీదవారికి, ధనికులకు వ్యత్యాసం లేని, సమసదుపాయాలతో విద్యను అందిస్తామని చెప్పింది. అందరికీ విద్య, ఉచిత విద్య అనే శీర్షికల క్రింది ఇచ్చిన వివరాలు విద్యారంగంలో ఇప్పటివరకు ప్రభుత్వాలు చేసిన తలక్రిందులు వ్యవహారాల్ని చక్కదిద్దేందుకు సరిపోయే విధంగా ఉన్నాయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|