|
|
Articles: TP Features | `చిక్కిపోయిన' చిరు - Site Administrator
| |
ఎన్నికల ముందు 'ప్రజారాజ్యాని'కి భారతీయ జనతాపార్టీతో ఎలాగైనా 'పొత్తు' కుదర్చాలని అధికార ప్రతినిధిగా పని చేసిన పరకాల ప్రభాకర్ ప్రయత్నించారు. ఆయన పార్టీని వీడుతూ 'ప్రజారాజ్యాన్ని - ప్రైవేట్ కంపెనీ'గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి 'పార్టీ పెడుతున్నారహో' అంటూ మీడియా ప్రచారానికి 'ఉప్పు' అందించిన మిత్రా కూడా 'ప్రజారాజ్యం'లో 'ఇమడలేనం'టూ నిష్క్రమించారు. చిరంజీవిని విమర్శించకుండా పోవడమే పెద్ద ఊరట! ఎందుకంటే అంతకు ముందు పార్టీ వీడిన విజయవాడకు చెందిన నానీ, పరకాల ప్రభాకర్, మరో ఎన్నారై ప్రజారాజ్యాన్ని దుమ్మెత్తి పోశారు.
ఎన్నికల తరువాత ఓటమి పరాభవం నుంచి కోలుకోక ముందే చిరంజీవిపై విమర్శలు మొదలయ్యాయి. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన అల్లు అరవింద్ పార్టీకి దూరంగా ఉన్నా కూడా పరిస్థితి చక్కడబలేదు. చిరంజీవి అనుభవ రాహిత్యాన్ని అవకాశంగా తీసుకున్న సీనియర్ రాజకీయ నేతలు తమ ఇచ్ఛానుసారం ప్రవర్తించారని చిరంజీవి మద్దతుదారులు అంటున్నారు. ఎన్నికల ముందు బిజెపి వైపు వెళ్ళాలని ఒకరంటే... ఎన్నికల అనంతరం తెలుగుదేశం వైపు మొగ్గుచూపితే బాగుంటుందని దేవేందర్ చిరంజీవిపై ఒత్తిడి తెచ్చారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|