|
|
Articles: Short Stories | ఉంగరం - Miss rajeswari rajeswarinedunuri
| |
ఆ రోజంతా వెతికారు. మర్నాడు శనివారం కావడంతో ఇద్దరు పుట్టిళ్ళకి వెళ్ళి పోయారు. కొంచం ఆశ్చర్య పడింది ఆదిలక్ష్మి. ఎందుకంటే 'చిన్నావిడ సాధారణంగా ప్రతి రోజూనో, రెండు రోజులకో పుట్టింటికి వెళ్ళి పోతూనే ఉంటుంది.ఎవరి అనుమతీ అవుసరం లేదు ఎవరికీ చెప్పవలసిన పనిలేదు. గుమ్మంలోకి వచ్చిన ఆటోని ఆపుజేసుకునో, పనిమనిషితో తెప్పించుకునో, ఇంకా వీలుకుదిరితే ఉదయం భర్తతోనే వెళ్ళి సాయంత్రానికో, మర్నాటికో, ఎప్పటికో తనిష్టం వచ్చినప్పుడు భర్తతో కలిసి వస్తూ ఉంటుంది, అది అలవాటే. కానీ పెద్దావిడ రాణి గారు మాత్రం భర్తతో స్కూటరు మీదో, కార్లోనో నెలకో, రెండు నెల్లకో ఓ సారి వెళ్ళి మళ్ళీ భర్త గారితోనే వచ్చేస్తుంది. అటువంటిది క్రిందటి వారమే వెళ్ళినా మళ్ళీ అంత హడావుడిగా ఎందుకు వెళ్ళిందా? అన్న ఆలోచన ఆదిలక్ష్మిని అంటి పెట్టుకుని ఉంది.
సరే ఈనాటి కోడళ్ళ గుప్పెళ్ళు నిండుగా లా పాయింట్లు. ఓ సక్కుబాయి అత్తగార్ని ఉదహరించుకుని అందర్ని అదేకోవలో నిరూపిస్తూ అవకాశం దొరికింది కదా అని' తమ సుఖాల కోసం తమ అవుసరాల కోసం తమ స్వార్ధం కోసం భర్తలకి నూరిపోసి తమ గుప్పెట్లో ఉంచుకున్న కోడళ్ళు స్వేఛగా రాజ్య మేలుతున్న రోజులివి. వారు ఏం చెప్పినా ఎదుటివారు నమ్మలేనంతగా బిల్డప్ప్లు ఇచ్చి అత్తల్నే అగచాట్ల పాలు చేస్తున్న కోడళ్ళ యుగమిది. అందుకే ఎంత ఆదర్శానికి పోయినా అత్తల గోడు అరణ్య రోదనే. ఒక మనిషిని అంచనా వేయాలంటే పుట్టుకతో వచ్చిన సంస్కారమేదైనా ఉంటే తెలియాలిగానీ నేర్చు కుంటే వచ్చిన చదువు వల్ల కాదు. చరిత్ర తిరగ బడుతున్న రోజులివి. ఇలాంటి ఆడవారి మధ్య జరిగే విషయాలు పొద్దున్న పోయి సాయంత్రం ఇల్లు జేరే కొడుకులతో చెప్పుకుని వారి మనసుని గాయపరచి మన:శాంతి లేకుండా చేయడం ఏ తల్లికీ నచ్చని పని. అందుకే ఏం చేస్తాం? ఇలాంటి చిల్లర విషయాలన్ని మనసులోనే ఉంచుకుని భర్తతో మాత్రం ఒక మాట అంది ఆదిలక్ష్మి. ఇవన్నీ తనకి సాక్షం లేని పన్లు అనుకుంటూ
చూడండి! నేనిలా తలస్నానం చేసి వచ్చేసరికి ఉంగరం పోయిందన్నారు, మొన్నటికి మొన్న గొలుసు సంగతి చెప్పాను కదా! ఐనా అంత నిర్లక్ష్యం అయితేఎలాగ చెప్పండి? అక్కడికీ అబ్బాయిలకి చెబితే 'మనకెందుకులే అమ్మా ఏదో ఏడవనీ' అని తేలిగ్గా తీసి పారేశారు. ఇంక గట్టిగా నేనేమైనా అంటే 'అత్తగారు రాక్షసి పీక పిసికేస్తుంది, కిరసనాయిలు పోసి అంటించగల్దు అని ఒక ప్రచారం. లోకం వాళ్ళ మాటే నమ్ముతుంది కానీ నిజానిజాల్ని పరిశీలించదు కదా?' అని బాధ పడింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|