|
|
Articles: Short Stories | పాలమ్మ - Site Administrator
| |
పెండ్లయిన రెండేండ్లకు... సుధాకర్ గాడు తొమ్మిదినెల్ల సంటోడు... గిట్లనే. వాన పడంగ...అద్మరాత్రి తలుపుగొట్టిండ్రు... తలుపు తీయంగనే పెనిమిటి చిన్నప్పటి దోస్తు కృష్ణమూర్తి కనవడ్డడు... ఆయనెనుక ఇంకో ఆరుగురు... అందరి భుజాలకు తుపాకులే...
'పాత దోస్తువని వచ్చిండ్రా సత్తెన్న. భారీగ వర్షం పడుతంది. అడుగు వేయస్తలేదు... తెల్లారంగనే పోతం... నీకు దయుంటె మా ఏడుగురికి కొంచెం అన్నం పెట్టియ్యరాదు' అనడిగిండు కృష్ణమూర్తి.
సత్తెన్న ఎనకముందయిండు...
'ఆకలని వచ్చినోనికి అన్నం పెట్టకపోతే మనమేం మనుషులం... నీకైతే బొట్టు లేదు బోనం లేదు' అని లస్మవ్వ ఆ రాత్రి అన్నం వండి, చల్లపులుసు చేసిపెట్టింది.
ఎన్ని రోజులైందో... కడుపునిండ తిన్నరు...
మబ్బుల్నే లేసిపోయిండ్రు. పొద్దుగాల ఎనిమిందింటికి పోలీస్ జీప్ రానే వచ్చింది.
సత్తెన్నను తీసుకపోయినోల్లు... రెండ్రోజులకు శవాన్ని దెచ్చిండ్రు... అప్పట్నుంచి లస్మవ్వ బతుకు పోరాటం చేసింది. అయ్యవ్వ గొట్టిన బర్రెనే దిక్కయింది. కానీ... ఆకలితోని వచ్చినోనికి అన్నం పెట్టుడు పాపమెట్లయితదో లస్మవ్వకు ఇప్పటికీ పురాత్తిగా అర్థం కాదు.
ఇప్పటికీ ఇంటికి బిచ్చగాడచ్చినా... ఏదన్న పెట్టాలంటె అగులుబుగులైతది. దానధర్మాలతోనే పుణ్యమత్తది బిడ్డా అని... కొడుక్కు మంచి మాటలు చెప్పాలన్న నోరు రాకపోయేటిది...
అన్నాన్ని చూసినప్పుడల్లా కలుక్కుమంటది. గుండెకు కొర్రిచీమలు పట్టినట్టు కలికలి అయితది. కొడుకు పెద్దోడైనంక అన్నల గురించి... పోలీసుల గురించి చెప్తుంటే ఒక్క అన్నం ముద్ద ఎనుక గింతటి పోరాటమున్నదా అనిపిచ్చేది. అర్థమైనంక ఓ పారి గుట్టల్లకు పోయి అన్నలకు జున్నుపాలు పోసి వచ్చింది. కొడుక్కు తెల్సి బాగా తిట్టిండు.
కాడు కాలుతనే ఉంది. లస్మవ్వ తడిసిన కొంగుతోని కండ్లు తుడుచుకున్నది. జెల్ది జెల్ది నడవాలని అడుగులేసింది. ముసురెక్కువైంది.
జగిత్యాలకు చేరేవరకు స్తంబం వెలుగులు ఇంక ఆరిపోలేదు. గేటు తీసుకుని ఓ ఇంట్ల అడుగుపెట్టింది.
'పాలముసల్దింకా రాలేదా...?' పేపర్ పట్టుకొని విసుక్కుంటున్నాడు ఇంటాయినె.
'పాలమ్మ రాలేదండీ... ఈ పాటికి వచ్చేదే మరి' అంటున్నది ఇంటామె.
ఆ మాటలు వినుకుంటనే 'పాలు పట్టుండ్రి లలితవ్వ...' అన్నది లస్మవ్వ.
'గిట్ల లేటయితే వాడుకం బందుపెట్టుమంటడు మా సారు' స్టీల్ గిన్నెల పాలు పట్టుకుంట హెచ్చరించింది ఇంటామె. లస్మవ్వ నవ్వింది... పాలకంటే తెల్లగా గునుకపువ్వు లెక్క.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|