|
|
Articles: TP Features | ధిక్కారమున్ సైతునా... - Site Administrator
| |
ఇక వివాదమల్లా క్రిమినల్ ధిక్కరణ విషయంలోనే ఉంటుంది. ఎందువల్లనంటే క్రిమినల్ ధిక్కరణ నిర్వచనం విస్తృతంగా ఉండడం వల్ల న్యాయమూర్తులకు నిర్ణయం విషయంలో చాలా విచక్షణాధికారం ఉంటుంది. ప్రజలకు ఏది ధిక్కారణో, ఏది కాదోనన్న సంశయం చాలా వరకు ఉంటుంది. ఈ సంశయం వల్లే చాలా సందర్భాల్లో బాధ్యత గల వ్యక్తులు, మీడియా మనకెందుకు గొడవ అన్న ధోరణిని ప్రదర్శిస్తున్నారు. కోర్టు తీర్పుల్లో కూడా ఏకాభిప్రాయం లేక గందరగోళంగా ఉంది. ఒకప్పుడు ధిక్కరణ అన్న అంశం మరొక్కప్పుడు ధిక్కరణ కాకుండా పోవడం ఆశ్చర్యకరంగా ఉంటుంది.
ఉదాహరణకు 1935 మార్చి 21న బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన, ఇతర న్యాయమూర్తుల పైన చర్చ జరిగింది. మార్చి 23న అమృత బజార్ పత్రికలో 'కలకత్తా హైకోర్టు' శీర్షికన ఒక వార్త ప్రచురితమైంది.
'నిన్న కలకత్తా హైకోర్టు నిర్వహణ గురించి బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో చర్చ జరగడం మనకు ఆనందదాయకమైంది. ఎన్.కె.బసు మాట్లాడిన ప్రతిమాట నిజం. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఒకప్పుడు దేశమంతా కీర్తించిన స్వాతంత్ర్యాన్ని ఇష్టపూర్వకంగా వదులుకోవడం దురదృష్టకరం, విచారకరం. ప్రజల మనోభావాల్ని ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు గౌరవిస్తారని భావిస్తాం. గతించిన తరం వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి.'
ఈ వార్త రాసినందుకు గాను ఆ పత్రిక సంపాదకుడు తుషార్ కాంతిఘోష్ కు మూడు నెలల జైలుశిక్ష విధించడం జరిగింది. ఇప్పటి భావప్రకటనా స్వేచ్ఛకి మనం సంతోషపడాలి.
అప్పటికే కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ ఒక పత్రికా సమావేశంలో న్యాయవ్యవస్థను విమర్శిస్తూ న్యాయవ్యవస్థ అణచివేతకు ఉపకరణమని న్యాయమూర్తులంతా ఒక తరగతికి చెందినవారై, ఒక ఆలోచనా విధానానికి అలవాటుపడి పేదవాడికి వ్యతిరేకంగా ధనికులకు అనుకూలంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపరచే విధంగా ఉన్నాయని కోర్టు ధిక్కరణ కింద శిక్షించారు. దాదాపు 20 ఏళ్ళ తర్వాత అప్పటి కేంద్ర న్యాయశాఖా మంత్రి శివశంకర్ దాదాపు అటువంటి వ్యాఖ్యలే బార్ కౌన్సిల్ రజతోత్సవ సభలో న్యాయవాదుల సమక్షంలో చేస్తే సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్టను ఏ విధంగానూ దిగజార్చలేదని కేంద్రమంత్రి వ్యాఖ్యలను నియంత్రించుకొని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించి కోర్టు ధిక్కరణ కిందకు రాదని తీర్పునిచ్చింది. ఈ తీర్పుని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణుడు స్వీరాయ్ తన రాజ్యాంగ గ్రంథంలో తప్పుపట్టారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|