|
|
Articles: Short Stories | నాన్నకు రాయని ఉత్తరం - Editor
| |
మాకు ఏ కష్టాలూ లేకుండా చూసి, చదివించి ఎంతెంత పెద్ద ఉద్యోగాల్లోకి వచ్చేట్లు చేసేరు మీరు? ఏ ఉద్యోగం లేదు మీ పిల్లల్లో? కాలేజీ ప్రొఫెసర్లు, స్టీలు ప్లాంటు జనరల్ మేనేజరూ, బాంక్ సీ.ఎమ్, టీచరూ, పశువుల డాక్టరూ, ఆర్థో డాక్టరూ, జర్నలిస్టూ.. ఇంటికి వచ్చిన అల్లుళ్ళూ, కోడళ్ళూ కూడా పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళే. ఇప్పుడు మనుమరాళ్ళు, మనుమళ్ళూ కూడా కాలేజీల్లోకి వచ్చారు.
తండ్రీ కూతుళ్ళకీ పుస్తకాలుంటే చాలు, ఇల్లూ, బంగారం లాంటి వాటి గురించి పట్టదు అని అమ్మంటే, ఇదుగో వీళ్లంతా నీ నవరత్నాలూ, మణులూ, వజ్రాలూనూ - ఒక్కొక్కళ్ళూ ఒక్కో మేడ కడ్తారూ అనే వారు మీరు.
నేను గొప్పకి రాసినవి కాదీ విషయాలు - మమ్మల్నందర్నీ మీ ఒక్కరి జీతంతో పైకి తెచ్చిన మీ ఔన్నత్యాన్ని చెప్పాలని తప్ప! మీ ఆదర్శాలు, ఆకాంక్షలూ ఉన్నత విలువలతో ఎలా సాధించారో చెప్పాలనే నా ఆరాటం.
మీ అంత గొప్పగా రచనలు చేయలేదు. కవితలూ అల్లలేదు. కాని నాలో ఏదో రాయాలన్న తపన, ఆతృత, ఆశలూ, ఆవేశం, కోరిక ఉన్నాయి. కాని ఏమీ చేయకుండానే వయస్సు దాటిపోతుంది. ఇక ముందయినా రాస్తానేమో అని నా ఆశ. అందుకే మీ స్నేహితులు చలంగారు, సౌరీస్, సంగీతరావుగార్లు, పంతల, మంధా, బుర్రా, భమిడిపాటి వారూ లాంటి పెద్ద వాళ్ళు రాసినట్లు నేను రాయలేకపోయినా, మీ మనసుకి నచ్చినట్లు నేను రాయగలనేమో అన్న ఆశతో, నమ్మకంతో రాశానీ ఉత్తరం.
ఈ టెలిఫోన్లూ, టివీలు, వీడియోలు, సినిమాలు, కాసెట్లు, కంప్యూటర్లు వచ్చిన ఈ నవలోకంలో ఉత్తరాల విలువ పడిపోతున్న ఈ సమయంలో మరోసారి ఉత్తరాలకి ఎంత విలువ ఉందో చెప్పాలని, ఉత్తరాలు రాస్తూ ఉంటే మనుషులు ఎంత దగ్గరవుతారోనని, మాసిపోతున్న మమతలూ, అనురాగాలూ, ఆప్యాయతలూ మళ్ళీ మానవత్వం పుంజుకుని బ్రతుకుతాయని తెలియజెప్పాలని, మనుషులు మళ్ళీ దూరమవకుండా ఉండాలని ఈ ఉత్తరం రాశాను.
మీరీ ఉత్తరం చదవాలని నాకెంతో తపన. తెలియలేని దు:ఖం నన్ను ముంచెత్తుతోంది. ఈ అర్థరాత్రి అంతులేని ఆగని కన్నీళ్ళు అడ్డుకుంటున్నాయి నన్ను రాయనీయకుండా. ఈ రోజు మీ డెభ్బై ఏడవ పుట్టిన రోజు.
ఇన్నాళ్ళూ నేను రాయలేదు... కాదు కాదు... రాయలేకపోయాను నాన్నా! రాసి ఉంటే మీ ఉత్తరాల్లోని, మీరు రాసిన ఆ వాక్యాలు రాసి ఉండేవారు కాదు కదూ!
మళ్ళీ జ్ఞాపకం చేస్తునాను నాన్నా - ఇంకోసారి ఎందుకో మీరు కోప్పడ్డారని రెండు రోజులు నేను మీతో మాట్లాడకపోతే, మిమ్మల్ని ఏదీ అడగకపోతే, చూడు బాల, నన్ను 'నాన్నా' అని అనడం లేదని అమ్మకి ఫిర్యాదు చేశారని అమ్మ చెప్పింది.
| Read 6 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|