|
|
Articles: Short Stories | ఆన్ లైన్ పెళ్లి - Editor
| |
'ఆరంభిస్తే మరి ఆగదు కదా! ఆ గొప్పలు చూడు జీవితంలో రెండు మొట్టికాయలు తింటే ఈ గొప్పలన్నీ గాలికెగిరిపోతాయ్' మా ప్రక్కనున్న ఆయన మెల్లగా భార్యతో అంటున్నాడు.
'ఇంతకీ చెప్పవలసిందేమిటంటే మా బుజ్జి... అదే మా నందగోపాల్, బిందూ కంప్యూటర్ చాటింగ్ లో దగ్గరై, అభిరుచులు ఏకమయ్యాక కాన్ఫరెన్స్ లలో కలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకుందామనుకుంటున్నారు. అటూ, ఇటూ పెద్దలకు తెలియజేశారు. ఈ రోజు ఉదయం వాళ్ళు అక్కడ సీడీలో వస్తున్న వేదమంత్రాల సాక్షిగా దండలు మార్చుకొని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. మా హోమ్ థియేటర్ లో మనం అదంతా చూసి తర్వాత డిన్నర్ ఎంజాయ్ చేద్దాం అంది మాలిని. పెద్దవాళ్లు కొందరు మా వెబ్ కెమెరా ముందుకు వచ్చి వాళ్లను ఆశీర్వదిస్తారు. ఇదీ ఇప్పుడు మన ప్రోగ్రామ్. పిల్చిన వారందరూ వచ్చినందుకు చాలా థేంక్స్.'
ఆవిడ మాటలు పూర్తికాక ముందే సస్పెన్స్ తీరిపోయిందుకు ఊపిరి పీల్చుకొని అందరూ కబుర్లలో పడిపోయారు. ఆన్ లైన్ పెళ్లి విందు అన్నమాట అని అర్థం చేసుకోగల వాళ్లు అనుకున్నారు. హాలులో లైట్లు మరింత డిమ్ అయ్యాయి. పక్క గదుల్లో వాళ్లు కొందరు మధ్య హాలులోకి వచ్చి కూర్చున్నారు. హోమ్ థియేటర్ తెరవైపు అందరి దృష్టీ మళ్లింది. ఉత్కంఠ పెరుగుతోంది. టీవి తెర రొద తప్ప బొమ్మలు రావడం లేదు. బుజ్జిది టైమంటే టైమ్ అన్న మనస్తత్వం, అంచేత ఫోన్ చెయ్యక్కర్లేదు అనుకుంది మాలినీ. ఆత్రుతగా సిస్టమ్స్ అన్నీ చెక్ చేసింది. గడియారాలవైపు పదే పదే చూస్తోంది. అప్పటికే ఆకలనిపించినవారు ఫుడ్ కౌంటర్స్ వైపు దారి తీయడం మొదలుపెట్టారు. పిల్లలు ఆడుకునే గదుల్లోకి వెళ్లిపోయారు.
మాలిని మరి ఆగలేక బుజ్జికి ఫోన్ చేసేసింది. బుజ్జి ఫోన్ ఎత్తగానే అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారని, వెంటనే తెరమీదకు రమ్మని చెప్పింది. 'నందూ వెంటనే తెరమీద క్లోజప్ లో కనపడి సారీ, మామ్, డేడ్, సారీ గైస్' అని ఆవలించేడు. ఓ పెద్ద లాగూ వాడూనూ. వెంటనే టీషర్ట్ వేసుకుని వచ్చాడు. వాడి వాలకం చూసి జరుగవలసిన కార్యక్రమం ఏదో జరిగిపోయే ఉంటుందనీ, పెళ్లి కూతురు కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడుతోందనీ గుసగుసలు, ముసిముసి నవ్వులు.
అమెరికన్ యాసలో అబ్బాయి అంటున్నాడు. 'ఓకే! ఓకే! అసలు విషయమేమిటంటే బిందూ ఓ ఎసైన్ మెంట్ మీద వాషింగ్టన్ వెళ్ళింది. ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంది. షివిల్ బి బేక్ బై ట్యూజ్ డే. అంచేత చిన్న పోష్ట్ పోన్ మెంట్. సారీ! ప్లీజ్ ఎంజాయ్ ద పార్టీ. బైయూ గైస్. బై డేడ్, కిసెస్ మామ్. ఓన్ మినిట్ ఓన్ మినిట్ ఐవిల్ ప్లే బిందూస్ రిగ్రెట్స్ ఆల్సో' అంటూ తెరనుంచి తప్పుకున్నాడు. ముందుగా రికార్డ్ చేసి ఉంచిన బిందూ పలకరింపు వేయడానికి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|