|
|
Articles: Drama | తెలుగు విలువల ఉగాది - Editor
| |
నాగలి గాడీలోకి - నక్కును దిగ్గొట్టరా
దాని గుదిగాడీలో - ఏడి కర్రదించరా
ఏటి కర్ర ముట్టెలోకి - మేడిని అమిరించురా
పూదు(పూజ)ను మోపెట్టురా - ఏటికర్ర కొనమీద
పలుపులు దోపీసి వుంచు - పూదూకన్నాలలోన
ఏదీ మోకందుకోర - ఇలాగిలాగ మెలిపెట్టి కట్టు
ఏటికర్రమీద పూదు - కదలకండ బిగియించు బింకంగా
ఎలపల దాపుల ఎద్దుల్నీ - పూనించీ వుంచరా
వాటి మెడలు బిగిసిపోకండా - పలుపులుతో కట్టివుంచు
ఏదేదీ... అందుకోర - ఊలు పువ్వుల కొరడా
(ఆకుమడి (నారుమడి)లోకి ఏరునుతోలికెళ్లి, తూర్పు దిరిగి దండమెట్టి, మట్టినిదీసి పెద్దోడి నుదుటున బొట్టుపెట్టి, దానిపై కుంకం అద్ది - అరుణ సూర్యబింబాన్ని మొక్కమని చెప్పి -)
కుడి చేతిన కొరడాపట్టు - ఎడం చేత మేడిబట్టు
నాగలినీ అదిమిపడ్డి కదలరా - సాలుదిప్పి నడవరా
అహ్హ...ఓహ్హ్...అద్దిగదీ...నిబ్బరంగ...నిబ్బరంగ...అహా...ఓహో... అలాగలాగ-
కంప్యూటరు నొక్కినట్టు - కాదురో దుక్కి
ఎలకతోక (మౌస్) తిప్పినట్టు - అవ్వదురో చాలుపోత
ఎంతవసరమో అంతే - అదమాలి మేడిని
ప్రింటుమీద కాదురో - జీవరాశుల మిషను ఏరు
జాగర్తగ నడకపోతే - బొక్క బోర్ల పడతావుర
దుక్కిమడి డిజైను కంటె - గొప్పపేజీ ప్రింటుంటద
నాగలికంటే గొప్ప - కలం గిలం వుంటదా
పలకరించు ఎద్దుల్ని - తెలుగూ శబ్దాలతోటి
ఇనమార్లు ముమ్మార్లు - దిద్దిరాయరో పద్యాన్ని
దున్నరో తెలుగు భాషలోన - రాయరో వచన వాక్యాల్ని
కావ్యమంటే వ్యయసాయం - రసమంటే ఫలసాయం
పురాణమంత ఇంతేరో - ప్రబంధమంటె అదేరో
(రైతు వయస్సు 60. బాల్యంలో రోజంతా శ్రమచేస్తూ, పక్క ఊర్లో ఎక్కడో అరుగుమీద చదువు చెప్పే పంతులు పంచ చేరి, అక్షరం ముక్కలు నేర్చుకొని, పురాణాలూ ప్రంబధాలూ విని జీర్ణించుకొని, నేర్చుకొన్నాడు రైతు. తెలుగులో పది 'డాక్టరేట్లు' చేసిన ప్రొఫెసర్లు ఈయనతో సరిరారిప్పుడు. ఈయన ఇంగ్లీషు చదివి అర్థం చేసుకుంటాడు గాని, మాట్లాడలేడు. సర్టిఫికేట్లూ డిగ్రీలు లేవితడికి. ఇట్లాంటి రైతులున్నారా అనుకోవచ్చును గాని వుండీ వుండీ వయసుమీరి, కనుమరుగవుతున్నారు. తెలుగు భాష పలుకుబడులు, సంస్కృతం తెలిసిగూడ - ఈ రైతు గ్రామీణ భాషా యాసలోనే మాట్లాడడానికి ఇష్టపడతాడు. వింత అనిపిస్తుంది మరి!)
(రైతు భార్యకు 55 ఏళ్ళు. నిరక్షరాశ్యురాలు. భర్త గుణాలు అబ్బి కొంచెం అటూఇటూగా తెలుగుభాషా యాస మాట్లాడుతుంది. తెలుగులోకి చొరబడిన ఇంగ్లీషు ముక్కలు మాట్లాడితే భర్త గేలి చేస్తూవుంటాడు... పిల్లల సంభాషణ వల్ల అబ్బిన భాష అది. 'కొత్తమాస' తెల్లవారుజామున వచ్చింది ఉగాది. ఏరుబూతుకు అంతా సిద్ధం చేసి, పిల్లా, పిచుకల్ని నిద్రలేపి, అర్థరాత్రినుండీ ఉగాది పనుల్లో మునిగిందీమె. తలంటు తానమాడి, జుత్తును కర్రపైనితో చిక్కుదీసుకొని, దువ్వుకొని మెట్టముడి గట్టుకొని, అందులో మల్లెలు ముడుచుకున్నది. బోనెపెట్టె తెరిచి, లోపలి అరలో దాచిన సరుకుల్ని తీసింది. కమ్ముల్ని సవరించుకుంది. తమ్మిట్లు చెవులకు బిగించుకుంది. మురుగులు చేతికి తొడిగి నిండా గాజులేసుకుంది. మట్టెలు కొత్తవి కాలి వేళ్ళకు దోపుకుంది. పసుపురాసుకున్న ముఖంపై నుదుటిమీద ఎర్రని సూర్యబింబమంత కుంకుమ బొట్టు పెట్టుకుంది. మెడలో దొంతె కాసుల పేరు వేసుకుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|