|
|
Articles: Short Stories | గ్రహణం - Site Administrator
| |
చానా బాగుండాడన్నా! నీ కొడుకు అన్నాడు చందు.
ఇద్దో చంద్రప్పో! వీడు చూసేందుకే కాదప్పా మాటల్లో కూడా ఏమీ తెలివితేటలనీ! అబ్బబ్బా ఎన్ని ఎన్ని తెలివితేటలో ఆ సిన్న తలకాయలో. నాకయితే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. వాడు పొయ్యిలో పెడితే పొంతలో ఎల్లొస్తాడు. పొంతలో పెడితే పొయ్యిలో ఎల్లొస్తాడు. నేను ఈటికి వస్తా ఉంటే ఏమన్నాడనుకుంటివి... నాయినా నీ మాదిరి నేను అమాలీని కాను, బాగా చదువుకోని పెద్ద ఆఫీసర్ని అయితా అనంటున్నాడు అంటూ నవ్వుతూ కొడుకు ఫోటో వంకే చూస్తు ఉన్నాడు మునెయ్య.
చందుకి మునెయ్య మాటల్లో బడాయి కనిపించలేదు. తమ పిల్లల గురించి, ఎంతో మంది చదువుకున్నోళ్ళకంటే అతను తక్కువే చెప్పాడనిపించింది.
సరేగాని, ఒకసారి వీడ్ని ఇక్కడకు తీసుకురా, అందరం చూస్తాం అన్నాడు చందు.
తప్పకుండా పిల్సుకోని వస్తా, వాడు మాట్లాడేటప్పుడు మీరంతా వాని నోటికల్లే జూస్తా ఉండిపోతారేమో అన్నాడు మునెయ్య.
వాడ్ని బాగా చదివియ్యన్నా! అంటూ ఫోటోని కవర్లో పెట్టి మునెయ్యకి అందించాడు చందు.
అవునప్పా! సదివియ్యల్ల... అట్లా ఇట్లా తెలుగుబడిలో కాదప్పా! మంచి ఇంగ్లీషు కాన్వెంటు బడిలో ఏస్తా... నాకెటూ సదువురాలా... వాడన్నా బాగా సదువుకోని పెద్దయినాక వాడు ఉత్త ఇంగ్లీషే మాట్లాడాలా అన్నాడు మునెయ్య.
ఇంగ్లీషు బల్లో ఎందుకన్నా! తెలుగుబడిలో చేరిపించు బాగా చదువుకుంటాడు అన్నాడు చందు.
లేదు లేదు. వాడు ఎంత తెలివైనవాడో మాటల్లో చెప్పలేను. అందుకే కచ్చితంగా ఇంగ్లీషే సదివిత్తా! ఇంకొక పదేండ్లకి సూడుమల్లా నువ్వే ఆచ్చెర్యపోతావు అన్నాడు మునెయ్య. గొంతులో దృఢత్వం కనిపించింది చందూకి.
ఇంట్లో తల్లీ తండ్రి చదువుకున్న వాళ్ళయి ఉండీ పిల్లలకి ఇంటి దగ్గర హోంవర్కు చేయిస్తూ, ట్యూషన్లకి పంపుతూ ఉన్న పిల్లలకి ఇంగ్లీషు కష్టం మీదయినా వస్తుంది. అట్లాంటిది మునెయ్యకి, అతని భార్యకీ తెలుగు అక్షరం ముక్కేరాదు. మరి అతని కొడుకుని ఇంగ్లీషులో ఎట్లా చదివిస్తాడు? మునెయ్య అమాయకత్వానికి జాలిపడ్డం మినహా మరేమీ చేయలేకపోయాడు చందు.
అయిదు నిమిషాల తర్వాత మునెయ్య వెళ్ళిపోయాడు.
తొమ్మిది గంటలు అవుతుండగా పిల్లలిద్దర్నీ వెంటేసుకొని, రికార్డు షీట్లు చంకన పెట్టుకుని గవర్నమెంటు ఎలిమెంటరీ స్కూలు చేరుకున్నాడు. ఆ కాంపాండులో ఎలిమెంటరీ స్కూల్ తో పాటూ, హై స్కూలూ, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ కూడా ఉన్నాయి. అయితే ఎలిమెటంరీ స్కూలు తప్ప అన్నింటిలోనూ ఒక అడపిల్లకు మాత్రమే ప్రవేశం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|