|
|
Articles: Festivals | గణేశ్ మహరాజ్ కీ జై - Site Administrator
| |
ఋషిపత్నులకు నీలాపనిందలు :
ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి, శాప భయంతో అశక్తుడై క్షీణిస్తుండగా, అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి, అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే దాల్చి పతికి ప్రియం చేసింది. అగ్నిదేవునితో ఉన్న వారు తమ భార్యలే అని ఋషులు శంకించి తమ భార్యలను విడిచిపెట్టారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అలాంటి నీలాపనింద వచ్చింది.
దేవతలు, మునులు ఋషిపత్నుల ఆపద పరమేష్ఠికి తెలిపారు. ఆతడు సర్వజ్ఞుడు అయినందున అగ్నిహొత్రుని భార్యే ఋషిపత్నుల రూపంలో వచ్చారని తెలిపి సప్తఋషులను సమాధానపరిచాడు. వారితో కూడా బ్రహ్మ కైలాసానికి వెళ్ళి, ఉమామహేశ్వరులను సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి సంతోషం కలిగించాడు.
'ఓ పార్వతీ దేవీ! నీ శాపం వల్ల లోకాలన్నింటికీ కీడు వాటిల్లుతోంది, దానిని ఉపసంహరింపు'మని దేవాదులు ప్రార్ధించారు. దీనితో పార్వతి సంతోసించి, 'ఏ దినం విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదని శాపావకాశం ఇచ్చింది. బ్రహ్మాదులు సంతోసించి తమ ఇళ్ళకు వెళ్ళి, భాద్రపద శుద్ధ చతుర్ధినాడు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్తగా ఉన్నారు.
శమంతక ఉపాఖ్యానం :
ద్వాపర యుగంలో ద్వారకలో నివసించే శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, స్తుతించి సంతోషంగా మాట్లాడుతూ, 'స్వామీ! సాయం సమయం అయింది. ఈనాడు వినాయక చతుర్ధి. పార్వతీదేవి శాపంతో చంద్రుని చూడకూడదు. కను నా ఇంటికి వెళతాను అనుమతి ఇవ్వండి!' అని పూర్వ వృత్తాంతం అంతా శ్రీకృష్ణునికి తెలిపి, నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు.
శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని పురంలో చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడు క్షీర ప్రియుడు కనుక తాను ఆకాశం వైపు చూడకుండా గోశాలకు వెళ్ళి పాలు పితుకుతూ, పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూశాడు. 'ఆహా! ఇక నాకు ఎలాంటి యపనింద రానున్నదో' అని సంశయంతో ఉన్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు అనే రాజు సూర్య వరంతో శమంతకమణిని సంపాదించి, ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణుని దర్శించేందుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనిని మర్యాద చేసి, 'ఆ మణిని మన రాజుకకు ' ఇమ్మన్నాడు. అత 'డది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చేదని చెప్పాడు. ఇలాంటి మణిని ఎలాంటి బుద్ధిహీనుడైనా ఇవ్వ'డన్నాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|