|
|
Articles: Short Stories | స్వర్గ యాతన - Site Administrator
| |
దేవిని కొకటూయాళ్ళవేసి కుదేసి ఊపుతున్నా పండుకోదా పిల్ల. ఊపులకు పెణకంతా (చూరంతా) కదిలి పోతోంటే కిచకిచా నవ్వుతోందీ గుంట.
చిన్నకూతురు, దాన్ని బొట్టెని (కూతురు పిల్ల) గుండెల మీద వేసుకొని... మసక మసక వాకిట్లో తిరుగుతూ జో కొడుతున్నా - తల్లి భుజాల్ని పట్టుకొని, గుండెల్ని తన్ని కిందకూ మీదికీ ఎగబాకురుతోంది. మద్దిమద్దిన తల్లి బుగ్గల్ని చీకి ఎంగిలి చేసేస్తుంది. వీపు మీద దెబ్బెట్టి కిందికి దించీసింది గుంటని. 'పిల్లల్తోటి పడలేకపోతన్నాం... ఎక్కడో దూరంగా... హాస్టల్లో పడీయాలగాని... ఈల్తోడి పడలేం... ఆఁ...' అనుకొని విసుక్కుంటుంది చిన్నమ్మి.
పేకాడుకుంటున్నారిద్దరు అల్లుల్లూ... 'అద్దరాత్రయ్యింది. బాగుంది సంబడం. తిండికి లెగరేటి' అరచింది పెద్దమ్మి.
'కోడికూర సల్లగైపోద్ది... పదరా తమ్ముడా' అన్నాడు పెద్దల్లుడు. 'ఆఁ... తిందురు గావాల... రేపు దసరా గదా... అయ్య ఎలాగూ తెచ్చాడొక పోతుని, యాటకి. చర్మంతోటి కలిపి తినీద్దురు రేపు... ఈ మాపిడికి పప్పన్నమే. రాండి...' పెద్దమ్మి. పేకముక్కలు సర్దీసి చిన్నల్లుడు లెగిసి 'వదినా... అన్నయ్యకు... బాగా తిండి నేర్పీసినావు...' అన్నాడు.
'ఆ... నీకూ నేర్పీసింది. మా సెల్లి... పేకాట' అంది. పెరట్లోంచి వచ్చి, బుగ్గల మీద చెయ్యేసి నొక్కుకుని -
'అవునూ... ఈ యాల్దాక తిన్లేదా? ఈళ్ళు... దీపాలార్పీయే అక్కా... కడుపుల్లో కాళ్ళెట్టుకు తొంగుతారాళ్ళే' సెల్లి.
'తమ్ముడూ! పదపదరా - గబగబా... మాడబెట్టీగల్రు. ఈ పొద్దు, యీళ్ళు మన పక్కలకే... రానట్టుంది' అన్నాడు పెద్దల్లుడు.
ఇద్దరక్కచెల్లల్నీ చూసి చుక్కలాకాసం, బొక్కి చందమామతో కలిపి మసగ్గా... ముసిముసిగా చూడ్డం కనిపెట్టింది ఉయ్యాలలోనున్న దేవి... ఇఇఇ నవ్వుతోంది.
'ఏం గుంటే ఇదీ... చెల్లీ... సెప్పడానికి సిగ్గేటిగాని... రాత్రిళ్లు... బావను దగ్గరికి రానిస్తందేటి' అక్క.
'నా గుంటముండ... ఇలాగ పొద్దు పోనివ్వదంటే నమ్ము... ఇయ్యాల దానికేటి పట్టుకుందో... ఏటోగాని... కడుపునిండా పాలు చీకించేస్తే... తెల్లారిందాకా ఒకటే తొంగోడమనుకో...' చెల్లి అంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|