|
|
Articles: Short Stories | తెలుగు పెర - Site Administrator
| |
నక్కి నక్కి మాట్లాడేవాడి జిత్తుల పద్ధతి చూస్తే వాడు పూర్వజన్మలో తప్పక నక్కై ఉంటాడన్పించి -మళ్ళీ ఇదొక ట్రాషా అనుకొని నవ్వుకుంటూ పై అంతస్తుకి చేరి రామసుబ్బయ్య గొంతు విన్పించి వాకిలి దగ్గరే ఆగి, తలెత్తి చూచాడు. 'టెన్త్ క్లాస్!'
'మనది అజంత భాష, అంటే అచ్చుల చివరి పలికే భాష. అచ్చులకు ప్రాణములూ, స్వరములని పేర్లు. ప్రాణములకంటే ఒకరికొకరు దగ్గరై, ఒకర్తో ఒకరు అనుసంధానం కావటానికి తోడ్పడేవి. స్వరమంటే ధ్వని, కంఠస్వరం, లయాన్వితమైన శబ్దం. హల్లులంటే 'క నుండి హ' వరకు ఉండే అక్షరాలు. ఇవి అచ్చులతో కూడి సరైన అర్థాలకి ఊపిరిపోస్తాయి. కనుక ప్రాణులూ, వ్యంజనములంటారు. ఏది పడితే అది తినే మనిషి ఎదిగీ ఎదగని మొక్కలా గిడసబారినట్లుంటే, సహజమైన ప్రకృతి ఆహారం తీసుకునే మనిషి నవనవలాడుతూ ఆరోగ్యంగా ఉంటాడు'.
చేనుకు రసాయనాలు వాడితే, తాత్కాలికంగా పంట పెరగొచ్చు. కానీ క్రమంగా నేల గుల్లబారి, సారం తగ్గుతుంది. మనసైనా అంతే. తల్లి భాషలో చెప్పే చదువు పుష్టికరమైన ఆలోచనలిస్తుంది. అందుకే తెలుగును ప్రేమించు, తెలుగులో జీవించు అంటాను నేను. బతకటం అంటే కాలాన్ని గతకటం, జీవించడమంటే అనుక్షణం ఒక జీవిగా జీవకళ పంచుతూ, జీవంతో ఉండటం. అది తల్లిభాషలోనే సాధ్యమవుతుంది.
డెబ్బయి ఏళ్ళు వస్తున్నా భాషాజాతీయతతో, జాత్యభిమానంతో ఖంగుమంటున్న తాతయ్య కంఠస్వరం విని, సంతోషం ఆపుకోలేక చప్పట్లు కొట్టడంతో, పిల్లలు కూడా ఆయాచితంగా చప్పట్లు చరిచారు. ఆ హోరు నిశ్శబ్దాన్ని చీల్చి, రామసుబ్బయ్య చూపుల్ని కిటికీవైపు తిప్పింది. ఒక్క క్షణం పరిశీలించి, చకచక వచ్చి, మనవడ్ని తనివారా కౌగలించుకొని 'ఎన్నేళ్ళయింది నిన్ను చూచి? అమ్మా నాన్నావచ్చారా?' అన్నాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|