|
|
Articles: My Thoughts | అజాగ్రత్తకు మందు - Site Administrator
| |
అలా అని ఒక రోగికి చికిత్స చేసే పద్ధతుల్లో భిన్నాభిప్రాయాలు ఉండకూడదని కాదు. ఒక వృత్తిలో, అదే వృత్తికి సంబంధించిన కొందరు ఒక పద్ధతిని అంగీకరించవచ్చు లేక విభేదించవచ్చు. అలా అని ఒక వైద్యుడు అజాగ్రత్త పరుడనడానికి వీలులేదు. అజాగ్రత్తగా ఎప్పుడు పరిగణిస్తారంటే, జాగ్రత్తగా ఉండే ఒక సామాన్య వైద్యుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అతని ప్రవర్తనకి కూడా విరుద్ధంగా ఉన్నట్టయితే అది అజాగ్రత్త కిందకి వస్తుంది. అందుకనే నిర్ణయంలో లోపమైనా, చికిత్స సమయంలో జరిగిన విపత్తైనా అజాగ్రత్త క్రిందకి రాదు. ఇది దృష్టిలో పెట్టుకొనే భారత శిక్ష్మాస్మృతిలో తగిన రక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి. శిక్ష్మాస్మృతిలోని 88వ సెక్షను ప్రకారం ఒక వైద్యుడు తన శస్త్ర చికిత్స వల్ల ఒక రోగి మరణించే ప్రమాదముందని తెలిసినా, అతని అనుమతితో అతని బాధను నివారించే ఉద్దేశ్యంతో శస్త్రచికిత్స చేసినట్టయితే, వైద్యుడికి శిక్షలేదు.
అలానే 92వ సెక్షను ప్రకారం విపత్కర పరిస్థితుల్లో రోగి అనుమతి లేకపోయినా, అతని మంచికోసం, సదుద్దేశంతో వైద్యుడు చికిత్స చేసినట్టయితే, దానివల్ల రోగికి హాని జరిగినా, అది శిక్షార్హం కాదు. 93వ సెక్షను ప్రకారం, ఒక వైద్యుడు సదుద్దేశంతో ఒక రోగికి ఎక్కువ కాలం బ్రతకవని చెప్పినప్పుడు, అటువంటి సమాచారాన్ని విని రోగి మరణించినట్టయితే, వైద్యుడు శిక్షార్హుడు కాదు. అటువంటి సమాచారం వల్ల రోగి మరణిస్తాడని వైద్యుడికి తెలిసినా కూడా వైద్యుడు బాధ్యుడు కాదు.
వైద్యుల రక్షణకు సుప్రీంకోర్టు కొన్నిఆదేశాల్నివ్వడం జరిగింది. ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిచ్చే వరకు ఆ ఆదేశాలు అమలులో ఉంటాయని చెప్పడం జరిగింది. వైద్యులకి వ్యతిరేకంగా ఏదైనా ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసినపుడు ఆ వైద్యుడు అజాగ్రత్తగా ఉన్నాడని మరొక వైద్యుడి ధృవపత్రం జతపరచవలసి ఉంటుంది. ఆ ఫిర్యాదును విచారించే అధికారి మరొక ప్రభుత్వ వైద్యుడి అభిప్రాయం తీసుకొని విచారణ కొనసాగించాలి. ఫిర్యాదు చేయబడిన వైద్యుడ్ని ఫిర్యాదు ఉన్నదన్న కారణంగా, విచారణలో సహకరించడనుకుంటే లేదా సాక్ష్యాల్ని తారుమారు చేస్తాడనుకుంటే తప్ప అరెస్ట్ చేయకూడదు. 2005లో ఇచ్చిన ఈ ఆదేశాల్ని 2009లో పునరుద్ఘాటన చేయడం జరిగింది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|