|
|
Articles: My Thoughts | కలకంటి కన్నీరొలికిన.. - Site Administrator
| |
సాధారణంగా మిగలదు. ఎందుకంటే అన్నీ కొలత ప్రకారం వండాలి. బడ్జెట్టుని ఏ పరిస్థితిలోనూ మించకూడదు. ఇంకా సూర్యోదయం కాకుండా లేవాలి. అందరికీ అన్నీ అమర్చాలి. ఇందులో ఏ మాత్రం తేడా రాకూడదు. ఇన్నీ చేశాకే నేను ఆఫీసుకు ఆదరా బాదరాగా పరిగెత్తాలి. కనీసం ఏ ఆదివారమో సెలవు దినమో వస్తే, నేను సుఖ పడటం వాళ్లకిష్ట ముండదు. ఆ రోజే ఇల్లు దులపడాలూ- బట్టలుతకడాలూ పెడతారు. అవేవీ లేకుంటే తీరి కూర్చుని ఇంటిల్లపాదీ తలంట్లు పెట్టుకుంటారు. నెల పూర్తవగానే పైసా తగ్గకుండా కడిగిన ముత్యాల్లా నేను జీతం మొత్తం తెచ్చి వాళ్ల చేతుల్లో పోయాలి. నా డబ్బుతోనే తాము తిండి తింటున్నామనే ఇంగితజ్ఞానం లేకుండా నన్ను సరిగ్గా తిండి తిన నివ్వరు. ఆకలికి తటు కోలేక ఆఫీసు క్యాంటీన్ లో కొనుక్కుని ఏవో కటింగ్స్ అనీ, చందాలిచ్చాననీ అబద్ధాలాడే దాన్నిరా. మనింట్లో నేనెప్పుడైనా అబద్ధమాడి ఎరుగుదున్రా? ఇంత వరకూ ఆడుతున్న అబద్ధాలు ఇక ముందు ఆడ లేనురా. ఎందుకో తెలుసా? వాళ్లకి నేను ఆఫీసు క్యాంటీనులో తింటున్నానని తెలిసి పోయింది. ఇక నేను అర్థాకలితో బతకాల్సిందే.'
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|