|
|
Articles: TP Features | కొండను తవ్వి... - Site Administrator
| |
అయితే, ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ అలా మెయిల్ పంపుతారని లేదు. కాని సరాసరిన ఆ పర్యావరణ ప్రేమికులు కనీసం 20 మెయిల్స్ అందుకుంటారు. అందుకున్న ప్రతి మెయిల్ ని తెరిచి చూసి చదవటానికి ఒక్కొక్క దానికి ఐదు నిమిషాలు సరాసరిన పడుతుంది. ఇరవై మెయిల్స్ తెరచి చదవాలంటే కనీసం గంట. ఒక్కొక్కరు ఒక గంట, ఆ బృందంలో ఉన్న 20 మందిని కలిపితే రోజుకు 20 గంటలు కంప్యూటర్ సమయం వృథా అవుతుంది. ఆ 20 గంటల కంప్యూటర్ వాడకానికి అయ్యే విద్యుత్ వినియోగం ఎంత? ఆ విద్యుత్ ని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే బొగ్గు వంటి ప్రకృతి వనరులు ఎంత? ఆ బొగ్గును కాల్చినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఆ కార్బన్ డయాక్సైడ్ వల్ల పెరుగుతున్న భూమి ఉష్ణోగ్రత... అంటే పర్యావరణ ప్రేమికులు తమ ఈ మెయిల్స ద్వారా చేస్తున్నది, గ్లోబల్ వార్మింగ్ మీద చర్చ. ఆ చర్చలో భాగం హరిత వాయువుల విడుదలను ఎలా నిరోధించాలి అనేది. అందుకోసం పరిశ్రమలు ఏమి చేయాలి! ప్రభుత్వాలు ఏమి చేయాలి! ఇవన్నీ ఒకరి నుంచి మరొకరికి పంపుతూ ఉద్యమంలో అందరినీ భాగస్వాములను చేయాలన్నది తపన. అందు కోసం ఈ మెయిల్స్ ఇచ్చుకుంటూ చేస్తున్నది మాత్రం ఉష్ణోగ్రతను పెంచే వాయువుల విడుదలకి దోహదపడే పరిస్థితి.
ఇది ఒక చిత్రమైన స్థితి. అందుకే ప్రపంచ స్థాయి ఆలోచనల కంటే మొదట పర్యావరణ ప్రేమికులు స్థానిక స్థాయి చర్యలు చేపట్టాలి. తాము ఏమి చేయగలమా, ఏమి చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవగలమా అని ఆలోచించాలి. అప్పుడే కొండను తవ్వాల్సిన పని ఉండదు. ఎలుకను పట్టుకోవాల్సిన అవసరమూ ఉండదు. అసలు సమస్యను, పరిష్కారాన్ని పక్కన పెట్టి విహారాలు చెయ్యనక్కర లేదు. ఎన్.జి.ఓల నిర్వహణ, సేవలు కార్పొరేట్ కళను, కార్పొరేట్ లాభాలను సంతరించుకున్న వారికి ఇలాంటి మాటలు అంతగా రచించకపోవచ్చు. అయినా చెప్పక తప్పదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|