|
|
Articles: TP Features | రేపు ఎవరికి తెల్లారేను? - Site Administrator
| |
గడచిన 20 సంవత్సరాలలో దేశంలో నుంచి అదృశ్యమైపోయిన ఉత్పత్తుల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీరు చివరిసారిగా బ్లాక్ అండ్ వైట్ చిత్రం చూశారు? మీరు చివరిసారిగా ఒక ఫౌంటెన్ పెన్ ను ఎప్పుడు ఉపయోగించారు? మీరు చివరిసారిగా టైప్ రైటర్ పై ఎప్పుడు టైప్ చేశారు? పై ప్రశ్నలన్నిటికీ సమాధానం 'నాకు తెలియదు' అనే. కొంత కాలం టైప్ రైటర్ కు కొద్దిపాటి ప్రత్యామ్నాయం ఎలక్ట్రానిక్ టైప్ రైటర్ ఉండేది. దానికి పరిమిత మెమరీ ఉండేది. ఆ తరువాత కంప్యూటర్ రంగ ప్రవేశం చేసి వాటన్నిటినీ అణచివేసింది. ఈ రోజు నా వంటి వారు చాలా మంది కంప్యూటర్ నే స్థాయి పెరిగిన టైప్ రైటర్ గా ఉపయోగిస్తున్నారు. కాని టైప్ రైటర్లు ఎక్కడా కనిపించడం లేదు.
చివరిగా మరొక ఉదాహరణ. 20 సంవత్సరాల క్రితం మన భారతీయులు అంతా ఉదయం నిద్ర లేపడానికి ఏది ఉపయోగించేవారం? సమాధానం 'అలారం గడియారం'. యాంత్రిక స్ప్రింగులతో పనిచేసే సాధనం అలారం గడియారం. దానిని పని చేయించడానికి రోజూ కీ ఇవ్వవలసి వచ్చేది. అది అలారం రూపంలో ఎంత శబ్దం చేసేదంటే మనతో పాటు కాలనీలో అందరికీ మెలకువ వస్తుండేది. అటుపిమ్మట క్వార్ట్ జ్ గడియారాలు వచ్చాయి. అవి నాజూకుగా ఉండేవి. అవి వినిపించే అలారం కూడా అంత నాజూకుగానే ఉండేది. మరి ఈరోజు మనం నిద్ర లేవడానికి ఏది ఉపయోగిస్తున్నాం? సెల్ ఫోన్! సెల్ ఫోన్ల ధర్మమా అని మొత్తం గడియారాల పరిశ్రమే ఎటువంటి హెచ్చరికా లేకుండా అదృశ్యమైంది. టైటన్ వంటి భారీ వాచ్ కంపెనీలూ దెబ్బతిన్నాయి. అందువల్ల పోటీ ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ ఎన్నటికీ తెలియదు.
చమత్కారంగా మాట్లాడవలసి వస్తే, రచయితలకు పోటీదారులు ఎవరు అవుతారనాలి. జోకులు వెదజల్లే యంత్రాలా? లేక కథ చెప్పే రోబోలా? భవిష్యత్తు భయం భయం. ఒక ఐటి సంస్థ బాస్ ఒకసారి పోటీ అని పేర్కొనే జంతువు గురించి ఆసక్తి కలిగించే ఒక విషయం చెప్పారు. ఆయన 'బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి లేదా బ్రేక్ ఫాస్ట్' (అల్పాహారం తీసుకోండి లేదా త్వరగా విడిపోండి) అని ఆయన అన్నారు. అది అంతా చక్కగా సూచిస్తోంది.
(డాక్టర్ వై.ఎల్.ఆర్. మూర్తి బెంగళూరు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ప్రొఫెసర్. ఆయన మద్రాసు ఐఐటి నుంచి ఎంటెక్, బెంగళూరు ఐఐఎం నుంచి మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్నారు.)
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|