|
|
Articles: Short Stories | తెలుగు పెర - Site Administrator
| |
లేదు తాతయ్యా! నేనొక్కడ్నే వచ్చాను.
ఏపనీ లేకుంటే బుర్ర కూడా తుప్పు పడ్తుంది. అందుకే చేరా. ఎలా ఉన్నాను?
'కొంచెం వంగినట్లున్నా, వంచినవిల్లులా ఉన్నారు'.
ఈ స్మశాన నిశ్శబ్దం చూస్తే నీకేమనిపిస్తుంది. శవాలు తిరుగుతున్నట్లు, శవాలు కూర్చొని వింటున్నట్లు, శవాలు బోధిస్తున్నట్లు అన్పించటంలా. అప్పుడప్పుడు నేను ఈ స్మశాన వికృతశాంతిని నేపద్యంతోనో, పాటతోనో 'డిస్టర్బ్' చేస్తుంటాను. ఎంతైనా ఇంగ్లీషు దేశం నుంచి వచ్చినోడివి కదా. గట్టిగా ఆనుతుందని ఒకే ఒక్క ఇంగ్లీషు పదం పుక్కిలించా.
గొంగళిలో భోంచేస్తూ, వెంట్రుకలనుకుంటే ఎట్టా? ఈ విద్యావిధానంలోనే ఇదంతా ఉంది. ఇక్కడ ఏ సృజనాత్మకతా రెక్కవిప్పదు. ముక్కలౌతుంది. ఏదైనా ఆలోచించటానికి తీరికెక్కడ? ఒకటే పరుగు, గాను గెద్దు బతుకు. సరే అమ్మమ్మ ఇంటి దగ్గరుంది వెళ్ళు. ఇంకో అరగంటలో నేనూ వస్తా! అత్యుత్సాహంతో, చేతులూపుకుంటూ పిల్లలవేపు అడుగులేస్తున్న రామసుబ్బయ్యను చూస్తూ, 'వస్తా తాతయ్యా' అంటూ స్కూలు కాంపౌండులోకి ప్రవేశించగానే ప్రిన్సిపాల్ మేడం ఎదురైంది.
ఆమెకు సతీష్ నమస్కరించాడు. 'సతీషేగా? మీ తాతయ్య ముక్కులోంచి ఊడిపడ్డట్టున్నావ్. విదేశాల్లో నివసిస్తున్నా, నువ్వూ మీ తాతయ్యలా దేశీయంగానే నమస్కారాలు చెప్పి, మనవడివనిపించుకున్నావ్'. సాయంత్రం పేరెంట్స్ మీటింగూ, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నై. నువ్వు పబ్లిక్ ఎడ్రెస్ చేయాలి. చాలా పెద్దపెద్దవాళ్ళు వస్తారు - తెలుగులో కాదు, ఇంగ్లీషులో, తప్పకుండా రావాలి. నువ్వు వస్తున్నావ్, అంతే? అంటూ చెడిపోయిన కారింజన్లా డబడబలాడి, బొడ్లో తాళాలగుత్తి 'టెన్, టెన్' మని ఊగుతుంటే నిశ్శబ్దాన్ని శబ్దం చేస్తూ వెళ్లిపోయింది.
గేటు దాటుతుండగానే 'తెలుగు స్పీకింగ్ ఈజ్ స్ట్రిక్ట్ ప్రొహిబిటెడ్ ఇన్ ది క్యాంపస్' అన్న బోర్డు వెనుకనుంచి వెక్కిరించినట్లు కన్పించింది. లోపలి కొచ్చేప్పుడు దీన్ని గమనించనందుకు తనను తాను తిట్టుకుంటూ, కందిరీగల తుట్టెలా ముసురుకుంటున్న ఆలోచనలతో బైటికొచ్చాడు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|