|
|
Articles: Short Stories | చదువూ సంస్కారం - Site Administrator
| |
ప్రయివేటు స్కూల్లు మూసీసినారని విని, అందులో తన పిల్లలు చదువుతున్నారని తెలిసీ - చీకట్లో గుంటలతో కలిసి - వీధిలో యెన్నెల పాటలు పాడీ... పాడించీ గెంతుతాదేటీ యాడది? అర్థంకాలేదు సీతప్పడుకి. సిన్నప్పుడు పెల్లాడీసినాను - ఈ ఆడదీ గుంటల్లో గుంటేగదా అనుకుని చిన్నగా నవ్వుకున్నాడే గానీ - మళ్ళా మనసుదిరిగి - ఈ రాములమ్మ గుంటముండకి మొగుడి ధ్యాసేలేదేమిటి? అనుకుంటూ నాలుక్కరుసుకొని - అది ముండయితే నా చావే గదా! అని గుండెలు బాదుకున్నాడు. 'ఆడదంటే మాజాకా! మొగుడు లేకపోతేటి? 'ఆది'శక్తి! ఆదినుండీ అదీ పనిచేస్తుంది, సంపాదిస్తుంది. పిల్లలు తల్లివెనుకే బడతారు.
నాయెనక ఇసుమంత ఆస్తిలేదు.. నేను బెట్టుపోవడానికి. ఏదిఏమైనా నీనూ దానెనకే బడాల... అంచేత, అది చెప్పిన మాటల్లోని గుణానికి విలువివ్వాలా అనుకుంటూ వాటిక్లో కొచ్చిన సీతప్పుడు 'రామనా సెందునాలో... పాటందుకున్నాడు. పాట, ఊరుకుంటాదేటి? పాదాల్ని కదిపిస్తది. పాదాలు కదిల్తే - శరీరం ఊరకుంటాదేటి? డాన్సు మొదలయ్యింది. రాములమ్మ సీతప్పడి చెయ్యి అందుకుంది. వీదిలో పిల్లలందరూ వారిద్దరి చుట్టూ వలయంగా, లయబద్ధంగా ఆడుతున్నారు. కష్టమనండీ, శ్రమనండీ - అదొకరకమైన అందమై, ఆనందమై, అన్నింటికీ మించిన సౌందర్యమై, బహిరంగంగా రూపుకట్టింది. ఈ సౌందర్యం ముందు చీకటెంత? వెన్నెలెంత? శ్రమ హృదయీకరించబడినప్పుడు, సమాజం కళాత్మకమై, కొత్తలోకావిష్కరణకు, తలుపులులేని ద్వారంబంధమవుతుంది.'
కూర ఉడకకముందే కడుపులు నిండిపోయాయి. పిల్లలు మాత్రం కడుపునిండా తిని గడపలో నిద్రపోయారు. రాములమ్మా గుంటేగదా... తాడిరేకుల చాపమీద వెల్లికిలా చారబడి, ఆవులించి, కనురెప్పల్ని మధురంగా వాల్చింది. దీపం బుడ్డి వెలుతురులో రాములమ్మ కుప్పపోసిన అందంలా ఉంది. సౌందర్యమంటే - ఆడదే అనుకున్నాడు. ఆమెపై చెయ్యివెయ్యడానికి జంకాడు. తాకితే కాలిపోతానేమోనని భయపడ్డాడు. అందం ప్రజర్విల్లినప్పుడు, అనుభవం కళ్ళు మూసుకుకోవాలేమో! ఆమెపక్కనే చారబడి ఉన్న సీతప్పడు మెల్లగా లేచి, గట్టిగా ఊది దీపం బుడ్డీని ఆర్పేసాడు. చీకటిలో చీకటిని చూస్తే, అనాధిగా అలిసిపోయిన కళ్ళు నిద్రలోకి దుమికి - ప్రశాంతంగా, తియ్యగా కాలాన్ని గుటకేశాయి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|