|
|
Articles: TP Features | హెడ్లీ చిన్నప్పట్నించీ అంతే! - Site Administrator
| |
2006లో అమెరికా, ఇతర దేశాల మధ్య సరిహద్దులను అవలీలగా దాటడానికి అతను తన పేరును డేవిడ్ హెడ్లీగా మార్చుకున్నట్లున్నాడని కోర్టు పత్రాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో అతను తన కుటుంబాన్ని ముస్లిం జనాభా అధికంగా ఉన్న షికాగోకు మార్చాడని, తన నలుగురు పిల్లలను మతపరమైన స్కూల్సుకు పంపాలని కోరుకున్నాడని అతని బంధువు చెప్పారు. అక్కడ ఆ కుటుంబం రెండవ అంతస్తులోని ఒక చిన్న అపార్ట్ మెంట్ లో నివసించింది. రాణాకు చెందిన ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ కోసం తాను పని చేస్తున్నానని హెడ్లీ చెప్పుకున్నాడు. వారిద్దరూ శుక్రవారాలు జమె మస్జీద్ మసీదుకు వెళుతుండేవారు. దారిలో వారు సమీపంలోని జామ్ జామ్ రెస్టారెంట్ లో భుజిస్తూ రాజకీయాలు మాట్లాడుకునేవారు. వారికి క్రికెట్ పై అభిమానం ఉందని పొరుగువారు చెప్పారు.
అయితే, హెడ్లీ స్థిరత్వం ఉన్నట్లుగా కనిపించేవాడు కాడు. అతనితో కలసి ఒక్కొక్కసారి క్రికెట్ చూస్తుండే మసూద్ ఖాదిర్ అతను 'భిన్నమైన' మనిషని, ఎవరితోను అంటీముట్టనట్లు ఉండేవాడని చెప్పారు. అయితే, ఇ-మెయిల్ మెస్సేజ్ ల ప్రకారం, హెడ్లీ పాకిస్తాన్ లో తాను చదువుకున్న మిలిటరీ హైస్కూలులోని తోటి విద్యార్థులతో సంబంధాలు కలిగి ఉంటుండేవాడని, రాజకీయాలు, ఇస్లామ్ గురించి చర్చిస్తుండేవాడని తెలుస్తున్నది.
ఈ సంవత్సరం ఆరంభంలో హెడ్లీ 'అమాయకులైన, నిరాయుధులైన ఆఫ్ఘన్ గ్రామస్థులపై నాటో క్రిమినల్ కీటకాలు 22 వేల పౌండ్ల బాంబులను వేసాయని' లేదా 'ఆగ్నేయాసియా రైతులపై నాపామ్ బాంబులు వేశాయని' ఫిర్యాదు చేశాడు. పాకిస్తాన్ ముఖ్య శత్రువు గురించి రాస్తూ, 'ఇండియాపై మేము ప్రతీకారం తీర్చుకుంటాం' అని అతను బెదరించాడు. పాకిస్తాన్ లో తాలిబన్లు ఒక పోలెండ్ ఇంజనీర్ తల నరకడాన్ని హెడ్లీ ఒక ఇమెయిల్ మెస్సేజ్ లో సమర్థిస్తూ, 'ఏ మనిషైనా చనిపోయేందుకు అత్యుత్తమ మార్గం కత్తితోనే' అని రాశాడు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|