|
|
Articles: Short Stories | విధ్వంసం - Mr. Pratap Cherukuri Pratap
| |
'చాలా ఘోరం జరిగిపోయింది నాయనా! గత నాలుగో తారీఖున మన నగరంలో బాంబు పేళ్ళుళ్ళు జరిగాయి కదా! ఆ రోజున కోడలు పిల్ల మనవడిని తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. భగవంతుడు మన పట్ల చాలా నిర్ధయంగా ప్రవర్తించాడు. ఆటో దిగి డాక్టర్ దగ్గరకు వెళ్తుండగా ఆ ప్రక్కనే బాంబు పేలిందిట. కోడలు మనవడు అక్కడికక్కడే …' దుఖంతో సుందర శాస్త్రి గారి గొంతు పూడిపోయింది.
ఆ మాటలు వింటూనే ఖలీద్ కాళ్ళ క్రింద భూమి అతి వేగంగా తిరుగుతున్నట్లనిపించింది. మస్తిష్కం లో వేయి బాంబులు పేలినట్లనిపించింది. ఆప్రయత్నంగానే ఆసరా కోసం గుమ్మాన్ని పట్టుకున్నాడు. ఇంతలో సుందర శాస్త్రి గారు లోపలి నుండి వచ్చిన
అన్నపూర్ణమ్మ గారి సహాయంతో ఖలీద్ ను తీసుకు వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టారు. ఎంతో ఆప్యాయతతో చల్లని నీరు త్రాగించారు.
'కోడలు పిల్ల పక్కన శిధిలమై వున్న బ్యాగ్ లో అడ్రస్ కాగితం ఆధారంగా పోలీసులు ఈ దుర్వార్తను మనకు అందించారు. అంకులే పోలీస్ స్టేషనుకూ, ఆస్పత్రికీ వెళ్ళి అన్ని పనులను చేసి రెండు శవాలనూ ఇంటికి తెచ్చారు. అంత విధ్వంసంలోనూ బాబు చేతిని కోడలు పిల్ల వదలలేదట. ప్రక్క వీధిలో వున్న ఆ ముస్లిం టైలరు వారి సహాయంతో అంతిమ సంస్కారాలను పూర్తి చేసారు. నువ్వేమో ఏదో వ్యాపారం పని మీద ఊరు వెళ్ళావట. నీ ఫోనుకు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు...' ఏవేవో చెప్పుకు పోతున్నారు అన్నపూర్ణమ్మ గారు.
అటుపై ఏమీ వినిపించడం లేదు ఖలీద్ కు. తానింత కాలం చేసిన పాపాలు దావానలంలా తన శరీరాన్ని, మనస్సునూ దహించి వేస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు ఖలీద్.
| Be first to comment on this Article!
| |
|
|
|
![](../images/spacer.gif) |
Advertisements |
|
![](../images/spacer.gif) |
![](../images/spacer.gif) |
Advertisements |
|