|
|
Articles: TP Features | సంఘానికే వైద్యం కావాలి - Site Administrator
| |
వ్యక్తిత్వ నిర్మాణం :
'One cannot make others happy, unless he himself is happy. True individualism consists in giving others the best that one can create. The bettering of the world depends on the progress of individuals. The test of one's progress is one's obility to realize that one's highest interests are not centred in ourself alone and the one's highest duties are not to oneself alone. The individual being the only real unit of society, the personalities which individuals realize determine the worth of society'.
Religion of the Modern Buddhist - Lakshmi Narasu, page - 225.
వ్యక్తిత్వమంటే ఇతరులను సమానంగా చూడగలగడమే. ఇతరులలో మన గుణాలే ఉంటాయనుకోవడమే. తట్ట అల్లే స్త్రీ, కుండలు చేసే స్త్రీ ఇద్దరూ శిల్పులనుకోవడమే. ప్రతి వ్యక్తిలోని ప్రతిభను గుర్తించి వెలికి తియ్యగలగడమే. ఈ వ్యక్తిత్వ పూర్ణత వల్ల విశ్వజనీనత భావన వస్తుంది. బౌద్ధంలోని తల్లితనం, విశ్వజనీన భావం, వ్యక్తిత్వ నిర్మాణం మానవోత్తేజాన్ని కలిగిస్తుంది. మానవుడు విశ్వజనీనుడైతే స్వార్ధంలేని సమాజ రూపకల్పన జరుగుతుంది. ఇదే సమసమాజ భావనకు మూలం. మనిషి తాను ఆరోగ్యంగా సమాజాన్ని ఐక్యంగా జీవులన్నిటినీ ప్రాణప్రదంగా చూసుకోగలిగే వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. బౌద్ధం ఒక మానసిక శాస్త్రం. ఒక సమాజ నిర్మాణ శాస్త్రం. ఒక వైద్యశిబిరం. ఒక ఉత్తేజ కెరటం. బౌద్ధం ఒక సామాజిక సంబంధాల సర్వస్వం. ఒక జీవన క్రమ విధానం. ఒక వ్యక్తిత్వ నిర్మాణ మార్గం. అందుకే బౌద్ధపథంలో నడుద్దాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|