TeluguPeople
  are the trend-setters

 
Articles: TP Features
భాషా ప్రాచీనత: కొత్త కోణాలు
- Site Administrator
< < Previous   Page: 5 of 9   Next > >  
బెర్నార్డ్ సార్జెంట్ చాలా నిక్కచ్చిగా చెప్పిన ఈ వాక్యాన్ని చూడండి : 'The Dravidians were certainly ahead of in Deccan when mature Harappan civilisation started-' తెలుగు నేల మీద పరిణతి చెందిన సింధు నాగరికతకు సమాంతరంగా ద్రవిడ భాష మాట్లాడిన ప్రజలు నివసించి ఉన్నారనేది ఆయన ప్రతిపాదన. బహుశా ఆనాటి తెలుగు మన తెలుగు భాషకు పూర్వరూపం కావచ్చు. దాన్ని Proto Telugu లేదా Proto Central Dravidian భాషగా పేర్కొనవచ్చు. ఋగ్వేద ఆర్యులతో కలిసి జీవించిన ద్రావిడులు : బెర్నార్డ్ సార్జెంట్, క్లయిడ్ అహ్మద్ వింటర్స్ ఇద్దరూ ఒకరినొకరు ఉదహరించుకోకపోయినా ఇంచుమించుగా ఒక రకమైన ఆలోచనాధోరణి కన్పిస్తోంది ఇద్దరిలో. 'The picture which emerges in that of multi dingual indus-saraswati civilisation with dravidian as the mind partner (Possibly Presented or atleast leaving its in southern metrobolin of mohenjodaro -' అంటాడు సార్జెంట్. ఇండస్ సరస్వతి నాగరికతలో ద్రవిడులు కొద్ది సంఖ్యలోనైనా నివసించి ఉంటారని, మొహెంజొదారోకి దక్షిణ ప్రాంతంలో వీళ్ళ ప్రాబల్యం కొంత ఉండవచ్చనీ ఆయన అభిప్రాయం. వాళ్ళు బహుశా ఇండో ఇరానియన్ ప్రజల్లో కలిసిపోయి ఋగ్వేద ఆర్యులుగా ఇండో ఆర్యన్లుగా మారి ఉంటారని సార్జెంట్ ఒక ఊహాత్మక ప్రతిపాదన చేశాడు. ఏదీ జరగకుండా ఋగ్వేదంలో ద్రవిడ పదాలు ఎలా చేరతాయి? అలా చేరిన పదాలు ఈనాటికీ తెలుగులో సజీవంగా ఉన్నాయి. దురదృష్టవశాత్తూ వాటిని మనం తెలుగులోకి వచ్చిన సంస్కృత పదాలుగా భావిస్తున్నాం. ఇక్కడ ఇంకో ముఖ్య విషయాన్ని ప్రస్తావించాలి. బహుశా ఇరాన్ నుంచి భారత ఉపఖండం వైపు ద్రవిడులు ఒక అలగా వస్తే, 8 వేల ఏళ్ళ క్రితం Mehrgarhలో ఉత్తర పశ్చిమ ఆసియా రాతియుగం నడుస్తున్న కాలంలో బంగాళాఖాతం తీరంలో, దక్షిణ భారత దేశంలో దక్షిణ తూర్పు ఆసియా రాతి యుగాన్ని ద్రావిడులు ప్రారింభించి ఉంటారనే ఇంకో ఊహాత్మక ప్రతిపాదనని కూడా వింటర్స్ చేస్తున్నాడు. బహుశా ఇరాన్ నుంచి మూడవ మార్గంలో - సముద్ర మార్గాన నేరుగా ద్రవిడులు దక్షిణ భారతదేశానికి చేరి ఉంటారని, డెక్కన్ లో స్థిరపడ్డాక, లోహ యుగంలో గుజరాత్ లోని ఇండస్ సైట్లు (లోథాల్ వగైరా సింధు నాగరికత ప్రాంతాలు) హరప్పా మొహెంజొదారో కన్నా ప్రాచీనమైనవని చాలా మంది భావిస్తున్నారు. ఒక కూజా మూత మీద ఉన్న ముడి ఆధారంగా గుజరాత్ మీదుగా దక్షిణాది నుంచే సింధు నగరాల నిర్మాణం ప్రారంభం అయి ఉంటుందనే నిరూపణ చేసిన ఒక పరిశోధన గురించి 'తెలుగే ప్రాచీనం' అనే గ్రంథంలో నేను వివరంగా అందించాను. గమనించగలరు.

Be first to comment on this Article!

< < Previous   Page: 5 of 9   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Get the best Results!
Reach potential customers thru TeluguPeople.com, advertise with us!!
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
College Admissions in USA
Guaranteed Admissions or Processing Fee will be refunded. At USAdmissions.com
EducationAndhra.com
One-stop Destination for Information on Educational Resources related to Andhra Pradesh
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2024 TeluguPeople.com, All Rights Reserved.