|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
ప్ర:- ఒరే,ఏడుకొండలూ! నన్నేడిపించకురా! దొరక్క దొరక్క ఓ చక్కటి ప్రియురాలు దొరికిందిరా! ఒరే సెవెనూ! ఈ విషయం నా రూమ్మేటుకు చెప్పకేం?!
ఏ:- ఛ! నాను సెప్పడమే?! నీతోడు. కాని ఓ సిగరెట్టిస్సుకో. ఓ అయిదు రూపాయలు కూడా ఇయ్యి. సినిమా కెల్లాల. అట్టయితే నీరూమ్మేటుకి సెప్పను.ఏమంటావు? గమ్మున తేల్సి సెప్పు.
ప్ర:- సర్లే! ఊ... ఈ విషయం నారూమ్మేటుకి చెప్పకు.
ఏ:- అదేటి గురూ! మాటిస్సి తప్పుతాడనుకుంటున్నావేటీ ఏడుకొండలు?
(ప్రకాశం అయిదు రూపాయలూ సిగరెట్టూ ఇస్తూండగా సుందరం ప్రవేశిస్తాడు.)
సుందరం:- ఏంట్రోయ్ ఏడూ?! అయిదు రూపాయలు కొట్టేస్తున్నావు?
ప్ర:- ఏడుకొండలూ నిన్న టిఫినుకి రెండున్నరిచ్చావుగా. అది తీసుకుని మిగతా చిల్లరిచ్చెయ్యి!
ఏ:- సిల్లర్లేదు గురూ! తర్వతిత్తాలే.
(ఏడుకొండలు అయిదు రూపాయలూ, సిగరెట్టూ జేబులో వేసుకుంటాడు.)
ప్ర:- ఒరే! ఏడుకొండలూ! ప్రేమ దొంగలున్నారు జాగ్రత్త! మరి నే వెళ్లొస్తాన్రా!
(ప్రకాశం వెళ్లి పోవును. మరల బయట కిటికీ దగ్గరకొచ్చి)- ఒరే సెవెనూ! ఆ రుమాలిలాగివ్వరా! (ఏడుకొండలు రుమాలందివ్వగా ప్రకాశం అది తీసుకుని వెళ్లి పోవును.)
[సుందరం తిన్నగా మంచం దగ్గర కెళ్తాడు.పరుపు కింద నించి ఒక నోట్ బుక్ తీస్తాడు.అందులో ఏదో రాసుకుం టూంటాడు. కారిడార్ లో ఎవరో ఇద్దరు స్టూడెంట్స్ గట్టిగా మాటాడుకుంటూ వెడుతుంటారు.కరు కారిడార్ లోంచిఫోనందుకుని రింగ్ చేసి ఏదో మాటాడుతుంటాడు.తను ఏం మాటాడుతున్నాడో వినిపించదు. ఏడు కొండలు సుందరం దగ్గరకెళతాడు.]
ఏ:- ఏంటి గురూ? నాకు చెప్పకుండా కొత్త పేర్లెక్కించేత్తుండావు?!
సుం:- నీకెందుకు చెప్పాలి?నువ్వు నాకు తెలీకుండా నారూమ్మేట్ తో కలిసి గూడు పుఠాణీ చేస్తున్నావుగా?!
ఏ:- నిజంగురూ! నీ కాడేటి గూడుపుటానీ? నిన్న రెండున్నర తీసుకున్నాడు. ఇయ్యాలిచ్చేసినాడు.
సుం:- మరైతే ఆ పందికొక్కు గాడు అంత టాయిలెట్టయి వెడుతున్నాడేం?
ఏ:- సినిమాకయ్యుంటది. ఆడి గొడవ మనకేటి గాని, సక్కగా ఈ ఉత్తరం సదివి నాకో పేమ లేక రాసి పారెయ్యి.
సుం:- ఇంతవరకూ నేను ప్రేమలేఖలు అమ్మాయిలకే రాస్తున్నాను గానీ, ఇంకా అబ్బాయిలకు రాసేదాకా రాలేదు. ఆ పని మొదలెట్టాక నువ్వురా!
ఏ:- (నవ్వి) ఏటి గురూ! ఆ శమత్కారం? నీ సిస్టరు వందనానికీ- నాకూ పెల్లి సెయ్యవేటి? నిజం సెప్పేత్తాను.మన కాడ రహస్యవేటి? ప్రకాశం గాడికి 'లవ్వూ దొరికింది.లేడీస్ హాస్టల్ కి ఫోను చేసి,అదే . . తాయారు తో మాటాడేడు.
సుం:- అమ్మబాబోయ్ ! అయితే, మా వాడికి గ్రీన్ సిగ్నల్ అన్న మాట. కొంప మునిగింది. (సుందరం గబ గబా ఫోను దగర కెడతాడు. ఫోను డయల్ చేస్తాడు.)
బవ్య:- హా!హతవిథీ!నీ దృక్కులు ఎంత కౄరంబులయ్యెడిన్? (అని పక్కకి తప్పుకుంటాడు ప్రేక్షకులకి కనిపించకుండా.)
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|