|
|
Articles: Short Stories | కొరికింది - Mr. krishna madugundu
| |
మాటలు సరిగా రానీ, నాలుకకు ఎముకలేదని, నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావు జాగ్రత్తా కోపంతో అంది.
దాంతో నాగభూషణం సారీ అంటూ పళ్ళికిలించాడు.
జతగా భార్యామణి కూడా నవ్వింది.
ఆటో ఎక్కి కూర్చుంది. భారీ శరీరం కావడంతో సగం పైగా సీటును ఆక్రమించుకొంది. పక్కన మిగిలిన సీటులో నాగభూషణం ఇరుక్కుపోయాడు.
ఆటోలో కూర్చున్న ఆమె భర్తతో మీరు గోపాల్ రావు భార్య మధుమతి ఇంటికి వెళ్ళి కొత్త సినిమా సీడీ ఒకటి తీసుకురమ్మంటూ అతన్ని మధ్యలోనే దింపింది. తప్పకుండా తీసుకురావాలని అతనికి ఆర్డర్ వేసింది.
శిరసావహించిన భర్త కార్యసాధనకు కదిలిపోయాడు నాగభూషణం.
అతను దిగిపోగానే సామానుల మూట సర్దుకొని ఫ్రీ అయ్యింది. ఊ పోనీమంటూ ఆటోవాడిని కసురుకుంది.
ఇంటికి కొంచెం దూరంలోనే ఆటో ఆగిపోయింది. చూస్తే టైరు పంచర్ అయిందనీ ఇప్పుడు రిపేర్ చెయ్యడం తన వల్ల కాదంటూ ఆటోవాడు చేతులెత్తి దండం పెట్టాడు.
గొడవపడి మాట్లాడినదానికంటే ఐదు తక్కువ ఇచ్చి పంపింది. అక్కడనుండి నడుచుకుంటూ ఇంటికి చేరుకునే సరికి ఆయాసంతో ఊగిపోయింది. మనిషికి చెమటలు పట్టాయి. ఫ్రిజ్ నీళ్ళు తాగి ఫ్యాన్ కింద కూలబడి పోయింది.
సీడి తెమ్మని భర్తని పంపించింది కానీ ఆయన తెస్తాడో తేడో అంటూ తిట్టుకుంటూ కూర్చుంది.
భార్య మాట జవదాటని నాగభూషణం భయంతో పనులు చేసాడే కానీ, ఏ ఒక్కటీ ఇష్టపడి చేసినోడు కాదు. భార్యామణి చెప్పిన దానికి తలాడించక తప్పదు... అదంతా కట్న మహత్యం. సుభద్రమ్మ వచ్చేటప్పుడు పుట్టింటి నుండి మోయలేనన్ని కట్నకానుకలు తెచ్చుకొంది. కట్నం వస్తే సుఖిస్తాననుకొన్న నాగభూషణానికి తిండి సుఖం వుందికానీ, స్వాతంత్ర్య సుఖం లేదు. విసుగొచ్చి భార్యను పొరపాటున ఏమైనా అంటే వెంటనే గయ్యాళి రూపం దాలుస్తుంది. చీపురు చేతబడుతుంది, చివాట్లు పెడుతుంది. ఆ అవతారం ఎత్తకుండా అతనే జాగ్రత్త పడుతూ ఆమె చెప్పిన దానికి తందానా అంటూ వుంటాడు. అతనికి ఇది తప్పితేమరేం పనిలేదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|