|
|
Articles: Novels | సాఫ్ట్వేర్ ఇంజనీర్ - Mr. prasad bondalapati
| |
' అదే ఆలోచిస్తున్నాను. ఊళ్ళో వున్నప్పుడు కమ్మ గా అమ్మ చేతి వంట తినే వాడిని. షికార్లూ... ఫ్రెండ్స్ తో కాలక్షేపం...ఏమి లైఫ్ లే...అప్పుడు ఒక్క పైసలే వుండేటివి కాదు. ఇప్పుడు పైసలున్నై ...కాని లైఫ్ మాత్రం లేదు.. టైం అసలే లేదు.'
'ఒక సన్నటి ఇరుకు రోడ్ లో ట్రాఫిక్ లో చిక్కుకుంది మా కాబ్. వెంకట్ బయటకు చూస్తూ సాలోచనగా అంటున్నాడు 'ఇక్కడ సిటీ అంతా దుమ్ము...పొగ...క్వాలిటీ అఫ్ లైఫ్ అస్సలు లేదు.'
'ఊళ్ళో ఉండే బాధలు ఇప్పుడు నీకు తెలియవు. అక్కడ ఉండే కష్టాలు అక్కడా వుంటాయి. ఊళ్ళో ఉన్నా వాళ్ళేమో వాళ్ళది ఎదుగూ బొదుగూ లేని జీవితమనే అసంతృప్తి తో ఉంటారు. ఒక్కసారి 'జాబు రాక ముందు మన జీవితం ఎలా వుండేదో గుర్తు తెచ్చుకో !'
బస్సు ఫోరం మాల్ ముందు ఆగింది. మాల్ ముందు అమ్మాయిలూ అబ్బాయిలూ గుంపులు గా వున్నారు. వాళ్ల హెయిర్ స్టైల్ నుండి నెయిల్ స్టైల్ వరకు అంతా మూస పోసినట్లు ఒకే విధం గా ఉంది. బహుశా ఊళ్ళోని బ్యూటీ పార్లర్లు అన్నీ ఒకే కోర్సు ఫాలో అవుతున్నాయేమో...! వాళ్ల హావ భావాలు కూడా అమెరికా లో మాస్ ప్రోడ్యూస్ అయినట్లున్నాయి. అమ్మాయిలయితే మోహానికీ, గోళ్ళకీ, జుట్టు కీ, పెదాలకూ ,కళ్ళ చుట్టూ రంగుల తో కలర్ ఫుల్ గా ఉన్నారు. ఇద్దరంమాయిలూ ఇద్దరబ్బాయిలూ మా కాబ్ ఎక్కారు.
'హవె యు జాయిండ్ న్యూలీ?' వాళ్ళలో ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి ని అడుగుతున్నాడు.
'ఉహు', ఆ అమ్మాయి నిట్ట నిలువు గా తల ఊపింది. తరువాత కొన్ని సెకన్ల వరకు ఆ తల అలా వూపుతూనే ఉంది. ఆ అమ్మాయి గేశ్చర్ కి అమెరికన్ లో అయితే అవును అని అర్థం. తెలుగు లో మాత్రం 'అలానా!' అని అర్థం.
'మా కాబ్ సిల్క్ బోర్డు దాటి బొమ్మనహళ్లి గుండా హోసూరు రోడ్ మీద పోతోంది. రోడ్ మీద ట్రాఫిక్ చూస్తె బెంగళూరు జనాలంతా ప్రాణ భయం తో పారిపోతున్నంత హడావిడి గా ఉంది. కంటికి కనిపించినంత మేర దుమ్ము తెరలు లేస్తున్నాయి. ఆ గడబిడ లో ఎక్ష్ప్రెస్స్ వే కోసం వేసిన పిల్లర్లు మాత్రం స్థిరం గా తాపీ గా నుంచొని ఉన్నాయి.
కంపెనీ బస్సు ల వెనక డ్రైవర్ రాష్ గా డ్రైవ్ చేస్తే కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ నంబర్లు రాసి వున్నాయి. కానీ, అన్ని కంపెనీ ల బస్సులూ రాష్ గానే పోతున్నాయి. 'నోటితో నవ్వి, నొసటి తో వెక్కిరించటం' అంటే ఇదేనేమో..!
మా కంపెనీ బస్సు ఇంకో కారు ని మెల్ల గా డీ కొట్టింది. మా కాబ్ డ్రైవర్ కిందికి దిగి కన్నడం లో బిగ్గర గా అరవడం మొదలు పెట్టాడు. అవతలి కారు లోని వ్యక్తి కి కన్నడం రానట్లుంది. ఏదో కంపెనీ ఎగ్జిక్యూటివ్ లా వున్నాడు. అతను ఇంగ్లీష్ లోనూ అప్పుడప్పుడూ హిందీ లోనూ ఏదో అరుస్తున్నాడు. వెనక ఉన్నా కార్లూ బస్సులూ అసహనం గా హార్న్ లు మొగించటం మొదలు పెట్టాయి. హాంకింగ్ దెబ్బకి డ్రైవర్ లు ఇద్దరూ సర్దుకొని మళ్ళీ డ్రైవింగ్ మొదలు పెట్టారు. ఈ సీన్ చూస్తె ఆఫీసు ప్రాజెక్టు లోని రిస్క్ యాక్టవీస్ గుర్తుకు వచ్చాయి. నిజ జీవితం లోని ఈ ఆక్సిడెంట్ రిస్కు ఎప్పుడు పోతుందో కదా...! నా సెల్ ఫోన్ రింగ్ అవుతోంది...సెంథిల్ కుమార్ ఫోను....తను రావటం రెండు నిమిషాలు లేటు అవుతుందట ...కాబ్ ని బొమ్మనహళ్లి లో తను వచ్చే వరకు ఆపమని. సెంథిల్ వచ్చాక కాబ్ స్టార్ట్ అయింది.
వెంకట్ హోసూర్ రోడ్ ని చూస్తూ మళ్ళీ మొదలు పెట్టాడు.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|