|
|
Articles: Drama | మానవతా మందిరం-2 - Mr. kompellaramakrishna murty
| |
(దృశ్యం:మసీదు, నెలవంక, నక్షత్రం)
ఇది ఇస్లాం మత చిహ్నం సోదరా!
నెలవంకను వీడి తార పోదురా
అల్లా పైనే మనసును లగ్నం చేయాలి
త్యాగశీలమే మనిషికి ఊపిరిగా ఉండాలి /ఇది /
కాలం: మతమంటే దేవునిపై విశ్వాసం
మమతే అది మనకు నేర్పు గొప్ప పాఠం.
మతములన్ని బోధించెను ప్రేమ తత్త్వము
అవి అన్నీ కాంక్షించెను శాంతి మార్గము
ఎదుట ఉన్న నదిని దాటవలసినప్పుడు
పుట్టైనా,పడవైనా ఒకటేరా తమ్ముడూ /మతమంటే/
ద్వేషించుట నేర్పలేదు 'భగవద్గీతా
కక్షలు రగిలించమనదురా 'ఖురానూ
'బైబిల్ ' విధ్వంసకాండ చేయమనదురా
'గురుగ్రంథం' క్రౌర్యాలను పెంచమనదురా /మతమంటే/
కాలం: శుభం భవతు! జయం భవతు! చిన్నారులారా!
మానవతా సుమ మందిర నిర్మాత లారా ! /శుభం భవతు/
మాలిన్యం అంటని దరహాసం మీది
మహితోజ్జ్వల దేశ భావి భాగ్యం మీది
కదలండిక చేయి, చేయి కలిపి పాడుతూ
వీథుల్లో సమైక్యతా రంగవల్లి దిద్దుతూ /శుభం భవతు/
* * *
'సర్వేత్ర సుఖినస్సంతు
సర్వే సంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిద్దుఃఖభాగ్భవేత్ '
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|