|
|
Articles: Drama | మాతా పుత్ర విరోధాయ... - Mr. kompellaramakrishna murty
| |
సీతమ్మ: అలా బాధపడకు బిడ్డా! డబ్బులో ఏముంది చెప్పు - ఈవేళ వస్తుంది, రేపు పోతుంది. నీ మీద నాకు, నా మీద నీకు ఈ ప్రేమానురాగాలిచ్చాడు ఆ దేవుడు. అదే మన సంపద. రా నాయనా! అన్నం కలిపి పెడతాను. తిను ఇప్పటికే పొద్దుపోయింది.
నారాయణ: అన్నానికేం తొందరలే అమ్మా! ఇందాకా పొలం దున్నుతూంటే నాగలికేదో అడ్డు పడినట్టు అయింది. ఏమిటా అని మట్టి తొలగించి చూశాను. ఏదో బిందెలా ఉందమ్మా!
సీతమ్మ: (ఆనందంగా) ఏమిటీ! బిందె కనిపించిందా! మరి తీసుకు రాలేదేం?
నారాయణ: తీసుకు వద్దామనుకున్నాను. కానీ అప్పుడు నువ్వు వీరయ్యగారితో మాట్లాడుతున్నావ్. ఆయన ఎదురుగా తేవటం ఎందుకని...
సీతమ్మ: మంచిపని చేశావ్. ఇంతకీ ఆబిందెలో ఏముంది?
నారాయణ: నేనూ ఇంకా చూడలేదమ్మా... తీసుకురమ్మంటావా?
సీతమ్మ: ఇంకా నెమ్మదిగా అడుగుతావేమిట్రా! అన్నం తర్వాత తినొచ్చులే.. కనుచూపుమేరలో ఎవ్వరూ లేరు. ఇదే సమయం. వెళ్ళి తొందరగా తీసుకురా..
నారాయణ: అలాగేనమ్మా! ఇప్పుడే తీసుకువస్తాను.(వెళ్ళాడు)
సీతమ్మ: భగవంతుడా! బుద్ధి తెలిసినప్పటినుంచీ కటిక దరిద్రంతోనే బతుకుతున్నాను. కన్నవాళ్ళూ దరిద్రులే, కట్టుకున్న వాడూ దరిద్రుడే! ఆ బిందెలో ఎముకముక్కలూ, బొగ్గుపెంకులూ కాకుండా బంగారునాణాలుంటే బాగుండును.. దేవుడా..దేవుడా..దేవుడా!
నారాయణ: (బిందెతో ప్రవేశించాడు) అమ్మా ఇదిగో బిందె తెచ్చేశాను. దీనికి రాగిరేకు టంకం వేసి ఉందే! లోపల ఏముందోమరి.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|