|
|
Articles: Drama | సంక్రాంతి 'చుట్టరికాలు' - Editor
| |
పిల్ల : నా కొడుకు సంతకెల్లి - బెల్లకుండ దెచ్చినాడు
దాని అల్లుడొస్తాడని బేగి - అరిసిలొండుతోంది కూతురు
వంకాయా నెత్తడ్లు - కూరొండొంతోంది కోడలు
పెద్ద చెరువులోన గెంతి - ఈతలు కొడతన్రు మనవలు
మట్టిపసికి ప్రమిదలు - కడుతున్నరు మనవరాళ్లు
కల్లాపిజల్లి వాకిట్లో - ముగ్గు పెడుతున్నరు బొట్టెలు
ఎడ్లబండి కడతన్నడు - నాకు మొగుడు నీకు అన్న
(కళ్లనిండ నీళ్లు తిరుగుతుండగా పిల్లను కనిపెడుతున్నాడు పిల్లడు. ఈ అభివ్యక్తి అర్థమేంటోమరి!)
పిల్ల : గరిసిడు ధాన్యం అమ్మి - గుడ్డా గోచీ కొన్నం
కట్టడు ధాన్యం ఆడించి - పండుగ ఖర్చుకుంచినాం
పంటలు ఈ ఏడు సరిగ - పండలేదు పిలడ
గాదిడు ధాన్యంతోటే - ఈ ఏడు ఎట్లు గడుస్తదొ
కారిడార్లు అంటన్నరు - భూములు కాజేస్తన్నరు
ఫోరు రొడ్లంటన్నరు - చెక్కా ముక్కాలాక్కుంటే
బతుకెలాగ సాగుతుంది - ఈ బలవంతుల రాజ్యంలో
పిల్లడు : భయంపడకు పిల్లా - నీ బతుకూ బాగుంటది
నీ బలగమె నీ బలమూ - భవిష్యత్తుమీద బెంగపడకు
తెలుగుమీడియమ్ములోనె - చదివించు నీ మనవల్ని
శక్తిమంతులవుతారు - జరుగుబాటు చూస్తారు
మనమట్టిలోనె మనసొర్గం - నిర్మాణం చేస్తారు
పిల్ల : నీ కడుపు సల్లగుండ - నీ మాటే నిజం పిలడ
నీ దీవనలూ మాకు - సరకూ సంపద పిలడ
నలుగు పెట్టిస్తానుండు - నీళ్లు పోసుకుందువు
బోగీ బువ్వెడతాను తినీ - బజ్జో లేద్దువుగాని
అస్తమానప్పటికి - అందరు చేర్తారింటికి
సంకురాత్రి పండగంత - సరదాగా వుండు పిలడ
కనుమ పండగనాడు - పశువుల్నీ చూద్దువు
ముక్కునుమ పండగన - ఎడ్లబండి తోల్దువు
పిల్లడు : చీరలు తెచ్చినాను పిల్ల - సింగారించు ఆడపిల్లల్ని
పంచె చాపుల్ని దెచ్చినాను - కట్టించు మగపిల్లలకు
తాను గుడ్డ తెచ్చినాను - కుట్టించు కమీజుల్ని
బనీన్లు దెచ్చినాను - సైజు బట్టి తొడిగించు
మిఠాయి తెచ్చినాను - తినిపించు పిల్లలందరికి
పంచదార తెచ్చినాను - పాసెమొండు పశువులకి
బుంగలొంద దెచ్చినాను - ఊది ఊది పంచుతాను
పొంగడాలు దెచ్చినాను - పంచుతానూరందరికి
పిల్ల : ఎర్రి గాని పుట్టిందేంటి - యేల ఇవన్ని పిలడ
పిల్లడు : అలగనక కలగనక పిల్ల - ఆవేశం పడలేదు నేను
అసలు సంగతి దెలవక - ఆకసానడుగెట్టినాను
అనుబంధాల విలువ - నీ ఇల్లు జూసి తెలిసినాను
శ్రమ జీవితంలోని గొప్ప - సొమ్ము సంపాదనలో వుండదు
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|