|
|
Articles: Drama | సంక్రాంతి 'చుట్టరికాలు' - Editor
| |
ఊరుమ్మడి నీళ్ళబావి వద్ద నీళ్లు తోడుతూ, బిందెను నింపుతూ - ఒక బస్తాలాంటి బ్యాగును ఈడ్చుకుంటూ దిక్కులు చూస్తూ వస్తున్న పిల్లడును తేరిపార చూస్తూ, జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, అచేతనంగా నీళ్లబిందెను చంకనెత్తుకొని, ఆ పిల్లడు సమీపానకొచ్చి-
పిల్ల : ఏవూరూ పిలడా? ఇలా గెలిపొచ్చినావు? ఆరిన భోగీమంటది! అడుగున అగ్గుంటాది మరి! అంతా దూరంనుండొచ్చి - అందల బడిపోగలవు భూఁవీ, ఆకాసం మద్దిన - నా రూపం యేపాటిది, చూపు తిప్పుకో పిలడా - చతికిల బడిపోగలవు, నా చేతి గాజుల్లోన - గల్లంతై పోగలవు రా! రా!
యెనకా రా పిల్లడా - దగ్గిరి చుట్టానివి, నువ్వు
చూపుతోటి నా బీపీని - గోకకుండా రా! పిలడా
నా నడకల్లో కాళ్లెట్టకు - తడిబడి పడిపోగలవు
ఎన్నాళ్లకు గొచ్చీసినావు
పిల్లాజెల్లా సుఖమా - నీ పెల్లమెలాగున్నాది?
(ఈ పలకరింపులోనే ఆ పిల్లను పోల్చీసినాడు పిల్లడు. అనుకోని చుట్టం అలాగ ఎదురవుతాదని ఊహించని పిల్లడు ఆశ్చర్యపడి, తేరిపార జూసి ఆమె వెనుక నడుస్తూ..)
పిల్లడు : సంకురేత్రికి నీ రూపం - సూద్దామని వచ్చినాను
ఎన్నిమాటలన్నావు - దెప్పి పొడిసినావు
అగ్గిబతుకు బుగ్గిలోన - నిగ్గుతేలినావు పిల్ల
సరే... సరే... వినుపిల్లా
సిటీలల్లా తిరిగితిరిగి - సింకి బేపినైనాను
నా నెత్తురు గెత్తమెత్తి - సదివించినాను పిల్లల్ని
సాఫ్టువేరులైపోయి - దేశాలంట బోయినారు
వాయీ వరసల్లేని - పెళ్లిల్లాడేసినారు
పిల్లీకూనల్లాంటి - పిల్లల్ని కనేసినారక్కడ
చూడొస్తా మర్రా అంటే - సీడీ లంపించినారు
సావుబతుకులోరే అంటే - సొమ్ములు పంపిస్తామంటరు
కష్టాల మాటెత్తితె - పొటోలు తోల్మంటరు
ఈ సెల్లుఫోన్ల మాటలేల - సూడొస్తామర్రా అంటే
పిల్లల్నీ సాకాలట - అమ్మను పంపిచమన్రు
ఆల్ల యేసాలు సూసొస్తానని - దేశాలకు ఎల్లిందది
కిస్మస్ కు యిద్దరము - సంకురాత్రికొక్కడ్ని
పిల్లా పెల్లాంలేని - బికారిగాడినైనాను
గేపకాని కొచ్చినావు - గ్రామానికి వచ్చినాను.
(ఇద్దరూ చెరొకపక్క ముక్కులు చీదీసినారు)
పిల్ల : గడపల కూకుంతావేటి? ఇంటిలోకి రా పిలడా
ఊరేసిన ఉసిరికాయ - ఇత్తడి గేసుడు నీరిదిగో
నోరూ తీపెక్కుతాది - వర్ర గురుతుకొస్తాది
(ఊరేసిన ఉసిరికాయ తింటుంటే నాలిక్కి పులుపూ వర్రా తగిలి నోరూరి చొంగకారింది. ఊరుబిండొడియం కావాలనిపించింది పిల్లడికి)
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|