|
|
Articles: Short Stories | బాలయోధులు - Editor
| |
రైలు వేగంగా వెళ్తోంది.
ఫస్ట్ క్లాస్ బెర్తుల మీద దర్జాగా పడుకుని గుర్రుపెడుతున్నాడు కోదండం, చిరంజీవి!
నాకు నిద్రపట్టక అటూ యిటూ మసలుతుండగానే టికెట్ ఎగ్జామినర్ వచ్చాడు.
నా పాస్ చూపించాను. చూసి వెనక్కివచ్చేసాడు.
కోదండాన్ని తట్టిలేపి టికెట్ అడిగాడు. పర్సులోంచి పాస్ తీసి చూపించాడు కోదండం.
వివరాలను చూసి స్వాతంత్ర్య సమరయోధుడు చిరంజీవిరావు ఎవరు? అనడిగాడు.
అలికిడికి కళ్లు తెరిచిన కోదండం మనవుడు ఠీవిగా సీటు మీద కూర్చుని నేనే అన్నాడు హస్తం పైకెత్తి.
టి.టి.ఇ షాక్ తిని, కలయో, నిజమో అర్థం కాక పెన్సిల్ తో బుర్రగోక్కున్నాడు. ముక్కుమీద జారుతున్న కళ్లజోడు సరి చేసుకుంటూ నువ్వు స్వాంతంత్ర్య సమరయోధుడివా?! నీ వయసెంత? అనడిగాడు విచిత్రంగా చూస్తూ.
మళ్లీ హస్తం చూపెట్టాడు.
నోటితో చెప్పు....
చెబుతున్నా కదా? అయిదేళ్ళు...
అయిదేళ్ళవాడివి నువ్వు స్వాతంత్ర్య సమరయోధుడివి ఎలా అవుతావ్? సందేహంగా అడిగాడు టిటిఇ.
మూగమనసులు సినిమా చూశావా?
చూశాను.
ఆ కథ జ్ఞాపకం చేసుకో... ఈనాటి ఈ బంధమానాటిదే... నేనే చిరంజీవిరావుగా స్వాతంత్ర్య సమరం చేసిన యోధుడ్ని. మళ్లీ మా ఇంట్లో పుట్టాను.
కావచ్చొ, కానీ మా రైల్వే రూల్స్ ఒప్పుకోవు... నువ్వు టికెట్ డబ్బులు, ఫైన్ కట్టాల్సిందే అన్నాడు జేబులోంచి రశీదు బుక్కు బయటకి తీస్తూ టిటిఇ.
చిరంజీవి తాతకేసి చూశాడు. అంతవరకూ ప్రేక్షకపాత్ర వహించిన కోదండం కోపంగా ఇంగ్లీషులో మాట్లాడాడు.
దానర్ధం-
ప్రభుత్వం వారిచ్చిన అధికార పత్రాన్ని కాదంటానికి నువ్వెవరు? ఇది భారతస్వాతంత్ర్య సమరయోధులందరికీ అవమానం. దేశ స్వాతంత్ర్యానికి, వాళ్లు చేసిన త్యాగాలకూ అవమానం వగైరా వగైరా...
టిటిఇ కూడా ఇంగ్లీషులోనే జవాబిచ్చాడు. దానర్థం
నాకవన్నీ తెలియవు. మీరు డబ్బులు కట్టాలి. లేకపోతే వచ్చే స్టేషన్లో దింపేస్తా... వగైరా వగైరా...
కొంతసేపు వాగ్వివాదం తర్వాత ఎట్టకేలకు తప్పనిసరై టిటిఇ చెప్పిన మొత్తాన్ని చెల్లించి నెత్తిన చేతులు పట్టుక్కూర్చున్నాడు కోదండం.
టిటిఇ తన డ్యూటీ కొనసాగిస్తూ వెళ్లిపోయాడు.
0-0-0
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|