|
|
Articles: Short Stories | యోగం - Mr. Satyam Mandapati
| |
నే చెబుతానుండవే వసంతా - అప్పుడు నాకూ ఏంచేయాలో తెలీలేదురా... నల్లటి నాగుపాము - పడగ కూడా విప్పింది. మనవాడు దాన్ని పట్టుకుని నవ్వుతూ వున్నాడు. వెంటనే దణ్ణం పెట్టుకుని 'సుబ్రహ్మణ్యస్వామీ నా పిల్లవాడ్ని నువ్వే కాపాడు. నీ పుట్టలో పాలు పోశాకనే వాడు పుట్టాడు. అందులోనూ నాగులచవితినాడు పుట్టాడు కనకనే నాగరాజు అని పేరు కూడా పెట్టాము. నువ్వే వాడిని రక్షించాలి స్వామీ' అని మళ్ళీ నమస్కారం చేశాను. నా ప్రార్థన ఆలకించి, సుబ్రహ్మణ్యస్వామి, మన రాజా చేతిలోంచి దిగి మెల్లగా సన్ననాజి గుబురులోకి వెళ్ళిపోయాడు' ఇంకా చెబుతున్న జానకమ్మ మాటలకు అడ్డు వచ్చింది వసంత.
'ఆ రోజు సాయంత్రం నాన్న రాగానే అమ్మ నాన్నకి అంతా చెప్పింది. ఆ రోజే నాన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పెద్ద పూజా అదీ చేయించి చలిమిడి పంచిపెట్టించాడు. పుట్టలో ఆవుపాలు పోసి అర్చన చేయించిందాకా నాన్నకీ, అమ్మకీ తృప్తి తీరలేదు! ఆ గుళ్ళో ఆచారిగారు ఆ నాగరాజే మన నాగరాజుని ఆశీర్వదించాడనీ, మన రాజుకి గొప్ప యోగం వుందనీ, ఆ రాజయోగాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరనీ చెప్పాడు!'
అంతా విని గాఢంగా నిట్టూర్చాడు శ్రీరాం.
'ఎంత గండం తప్పింది!' అన్నాడు రాజాను దగ్గరకు తీసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంటూ.
'ఇది జరిగి మూడు రోజులయిందిరా' అన్నాడు తండ్రి రాఘవయ్య.
'మరి ఆ సన్నజాజి పొదలో వెతికారా? ఆ పాము, బహుశా ఇంకా అక్కడే వుందేమో, దాన్ని పట్టుకుని చంపకపోతే మళ్ళీ బయటకు వచ్చి ఎవడ్నో ఒకడ్ని కాటేస్తుంది!' అన్నాడు శ్రీరాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|