|
|
Articles: Short Stories | యోగం - Mr. Satyam Mandapati
| |
'మనవాడిది గొప్ప యోగం అని చెప్పాడు శాస్త్రులుగారు' అన్నది వసంత, శ్రీరాంతో.
'ఆ యోగం కోసం ఒక యజ్ఞం చేయాలనీ ఒక ఆవునో, ఏనుగునో తనకు దానం చేయాలనీ అనలేదా? నవ్వుతూ అన్నాడు శ్రీరాం.
నీకు బొత్తిగా భయమూ, భక్తీ లేవురా - పెద్దవాడివి నువ్వే అలా మాట్లాడితే నీ చెల్లెలూ, తమ్ముళ్ళూ కూడా నీలాగే తయారవుతారు' అన్నది జానకమ్మ.
'అన్నయ్య సెలవులకు వచ్చింది నువ్వు పెట్టే చివాట్లు తినటానికి కాదమ్మా, సరదాగా గడపటానికి' అన్నది వసంత.
'తెలుసులేవే - మొన్నేం జరిగిందో తెలుసా నాయానా...' జానకమ్మ చెప్పబోయింది.
'నే చెబుతానుండవే అమ్మా - మరే అన్నయ్యా - మొన్న రాజాకి పెద్ద గండం తప్పింది... ఆనాడు జరిగిందంతా గుర్తుకువచ్చిందేమో, వసంత ముఖంలో భయం స్పష్టంగా కనపడింది.
మూడేళ్ళ రాజాను ఒళ్ళోకి తీసుకుంటూ... ఏం జరిగిందో త్వరగా చెప్పవే - నన్ను చంపక అన్నాడు శ్రీరాం.
'మొన్న మధ్యాహ్నం నాన్నేమో పొలానికి వెళ్ళాడు, అమ్మేమో అన్నాలు తిన్న తర్వాత మధ్య గదిలో నడుం వాల్చింది. నేనూ రాధా ముందుగదిలో కారమ్స్ అడుకుంటున్నాం. మధ్యాహ్నం రెండు గంటలయింది అనుకుంటాను టైమ్. రాధ మంచినీళ్ళు కావాలంటే లోపలకు వచ్చి వరండాలోకి చూసేసరికి గుండె లదిరిపోయాయి. రాజా వరండా వెనకాల వున్న సన్నజాజి పందిరి క్రింద కూర్చుని వున్నాడు. వాడి చేతిలో పొడుగాటి నల్లటి త్రాచుపాము. నవ్వుతూ దానితో ఆడుకుంటున్నాడు. అది చూడగానే నాకు భయం వేసింది. నోట మాట రాలేదు. ఇంతలో తేరుకుని గబగబా వెళ్లి అమ్మను, రాథను పిల్చుకువచ్చాను. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? చూస్తూ నుంచున్నారు. రాధ, వాళ్లన్నయ్యను కేకేస్తానని పరుగెత్తుకు వెళ్ళింది. అప్పుడేం గమ్మత్తు జరిగిందో తెలుసా?' చక్రాల్లాంటి కళ్లను త్రిప్పుతూ చెబుతున్నది వసంత.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|