|
|
Articles: Short Stories | యోగం - Mr. Satyam Mandapati
| |
జానకమ్మ చెంపలు వాయించుకుంది. 'అలాంటి అపచారం మాటలు అనకు. సాక్షాత్తూ ఆ సుబ్రమణ్యేశ్వరుడే ఆ పాము. అది మామూలు పామే అయితే మనవాడిని ఆ రోజే కరిచేది. నల్లత్రాచుని చంపితే కళ్ళు పోతాయి. దైవాంశంగల పాములు అవి! వాటి మీద భక్తిగా వుండి నమస్కారం చేస్తే అవి మన జోలికి రావు.
ప్రక్కనే వున్న పాలేరు అప్పన్న అన్నాడు - 'అది నిజమే బాబూ - మా యింటికాడ సత్తిగాడు అలాగే నల్లత్రాచుని చంపిన వెంటనే ఆడి రెండు కళ్ళూ పోయాయి. మా గూడెంలో వాళ్ళాంతా ఆ పాము శవాన్ని ఊరేగించి, మంత్రాలతో దహనం చేశాం బాబూ - అప్పుడు గానీ సత్తిగాడి పాపం పరిష్కారం కాలే!'
అంటే అప్పుడు పాపం పరిష్కారం అయిపోయి వాడికి కళ్ళు వచ్చాయా? అడిగాడు శ్రీరాం.
పాలేరు అన్నాడు - పోయిన కళ్ళు మళ్ళీ రాలేదు బాబూ - కానీ పాపం పరిష్కారమయి పోయింది.
అది సరే కానీ మధ్యాహ్నం ఖాళీగా వున్నప్పుడొకసారి యిలారా - ఆ సన్నజాజి పందిరి క్రింద లోతుగా గోతులు వున్నాయి ఆ పాము అక్కడే వుంటున్నదేమోనని నా అనుమానం. అది తవ్వి చూద్దాం. అలాంటి విషకీటకాలను, పిల్లలు తిరిగే యింట్లో వుంచడం చాలా ప్రమాదం!
ఆ పామును మాత్రం ఏం చేయకురా నాయనా. అది మామూలు పాము కాదని చెబుతున్నానా? ఆ పడగా అదీ - తల మీద మణి, దైవాంశవున్న పామది...' ఇంకా ఏదో చెబుతున్నది జానకమ్మ.
అమ్మా పాములు గురించి నాకు బాగా తెలుసు. మద్రాస్ యూనివర్శిటీలో నేను చేస్తున్న రిసెర్చి పాముల గురించే - అడయార్ లోని స్నేక్ పార్క్ డైరెక్టర్ రోములస్ విటేకర్ సహాయం కూడా నాకు వుంది. పాములు దైవాంశ కలవీ కాదూ - ఇంకేమీ కాదు. పాము పడగ మీద మణులు వుండటం అబద్ధం అన్నది నిరూపించబడిన నగ్నసత్యం. అంతే కాదు సినిమాల్లో చూపించినట్టు విషం కక్కిన పాములు నమస్కారం పెట్టగానే విషం మళ్ళీ వెనక్కి లాగేసుకోవడం అన్నది ఎక్కడా జరగదు - ఇంతవరకూ ఏ పామూ అలా చేయలేదు. అలాగే నీ సుబ్రమణ్యస్వామి కోసం పుట్టలో పాలుపోసిన పాలు మట్టిలో ఇంకిపోతాయే కానీ, పాము తాగదు. సర్పయాగం చేసినంత మాత్రాన పిల్లలు పుట్టరు. ఇవన్నీ పరమ మూఢనమ్మకాలు
'చదివేస్తే వున్నమతి పోయిందట. వీడిని రీసెర్చికి పంపించవద్దంటే విన్నారు కారు మీరు. ఇప్పుడు చూడండి భయం, భక్తీ లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో' జానకమ్మ రాఘవయ్యతో నిష్టూరంగా అంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|