|
|
Articles: Short Stories | జానకి - Site Administrator
| |
(శ్యామలదేవి దశిక)
జానకి భర్తతో అమెరికా వచ్చి 40 ఏళ్ళపైనే అయింది. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి పెరిగి హైస్కూల్ ఫైనల్ వరకే చదువుకున్న జానకి పెళ్లి తమాషాగా ఇట్టే జరిగిపోయింది. బంధువుల ఇంట్లో పెళ్లికని తల్లితండ్రులతో వెళ్ళిన జానకి పెళ్ళికూతురై తిరిగొచ్చింది. ప్రెండు పెళ్ళికని వచ్చిన రవిని, కుందనపు బొమ్మలా వున్న జానకి అందం, ఆమె అమాయకత్వం ఆకర్షించాయి. ఏ ప్రయత్నమూ చేయకుండానే అంత మంచి సంబంధం రావడం చూసి జానకి అదృష్టానికి తల్లితండ్రులు మహా సంబరపడిపోయారు. పిల్లవాడు బాగా చదువుకున్నాడు, టిప్ టాప్ దర్జాగా ఉన్నాడు, అన్నిటినీ మించి కానీ కట్నం లేకుండా చేసుకున్నాడు.
పెళ్ళిలో అప్పగింతలు అవగానే అత్తవారింటికి బయలుదేరి వెళ్తున్న జానకితో తల్లి 'మీ అత్తవారు మనలాగా పల్లెటూరి వారు కాదు. పట్నంలో వుండే వాళ్ళు, చదువుతున్న వాళ్ళు, పైగా వున్నవాళ్ళు. వాళ్ళ పద్ధతులు అలవాట్లు, తెలుసుకొని వాళ్ళ కనుగుణంగా నువ్వు మారాలి గుర్తుంచుకో' అంటూ బోధించింది. అసలే కొత్త చోటుకు వెళ్తున్నానన్న భయంతో వున్న జానకి తల్లితో వెంటనే అలాగే అంటూ తల వూపింది.
హైదరాబాద్ లో అత్తవారింట్లో అడుగు పెట్టిన జానకకి అక్కడ అన్నీ వింతగా, కొత్తగా అనిపించాయి. పనివాళ్ళతో, బయటవాళ్లతో చకచకా హిందీలోనూ, జానకికి అర్థం కాని తెలుగుభాషలోనూ, మావగారి ఫ్రెండ్స్ తో కొద్దిగా ఇంగ్లీష్ లోకూడా మాట్లాడే అత్తగారి చాకచక్యం చూసి జానకి ఆశ్చర్యపోయింది. తెలియనివి నేర్చుకుంటూ, కొత్త వాతావరణానికి అలవాటుపడుతున్న టైములో జానకి భర్త 'వచ్చే నెలలో మనం అమెరికా వెళ్తున్నాం' అన్నాడు.
బొంబాయిలో విమానం ఎక్కేముందు అత్తగారు జానకితో, 'మనవాళ్ళంటూ ఎవ్వరూ లేని దూరదేశానికి వెళ్తున్నారు ఇద్దరూ, దొరలు-దొరసానులు వుండే దేశం అది. అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో. వాడి మనసు గ్రహించి, వాడి ఇష్టానికి తగినట్టుగా నువ్వు మారాలి గుర్తుంచుకో' అంటూ సలహా ఇచ్చింది.
అత్తగారంటే ఎంతో గౌరవం వున్న జానకి వెంటనే భక్తిగా తల వూపింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|