|
|
Articles: Short Stories | జానకి - Site Administrator
| |
పదహారేళ్ళ వయసులో పెళ్ళి పేరిట పల్లెటూరు వదిలిన ఆ జానికి వేరు. 40 ఏళ్ళకు పైగా అమెరికాలో స్థిరపడిన ఈ జానకి వేరు. ఇన్నేళ్ళలో జానకి ఎంతో ఎత్తు ఎదిగింది. ఎన్నో ఆటుపోట్లు తింది. ఎన్నో సుఖాల్ని, వింత అనుభూతుల్ని పొందింది. అన్నింటికి మించి జానకి పరిస్థుతుల కనుగుణంగా ఎంతో మారిపోయింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ జానకికి ఇంకొకటి కూడా అర్థమయింది. పిల్లలతో కనీస సంబంధబాంధవ్యాలు నిలబెట్టుకోవాలంటే వాళ్ళననుసరించి పోతూ, వాళ్ళ ఇష్టమే తన ఇష్టంగాబావించడం తప్ప వేరే మార్గం లేదన్న నిజాన్ని తెలుసుకుంది. అందుకే వాళ్ళ చదువుల విషయంలో కానీ, ఉద్యోగవిషయాల్లో కానీ, ఆఖరికి వాళ్ళ పెళ్ళిళ్ళ విషయంలో కూడా జానకి ఎటువంటి అభ్యంతరం పెట్టుకోలేదు. పిల్లలు ముగ్గురూ మూడు రకాలుగా వాళ్ళకిష్టమైన వాళ్ళను చేసుకున్నారు. పెద్దవాడు విజయ్ కాలేజీలో తనతో చదువుకున్న అమెరికన్ అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయి రేఖ తన ఆఫీసులో పనిచేసే పంజాబి అబ్బాయిని చేసుకుంది. చిన్నవాడు వినోద్ ఆఫ్రికాలో పుట్టి, గయానాలో పెరిగి, అమెరికాలో స్థిరపడ్డ అమ్మాయిని చేసుకున్నాడు. జానకి ఇప్పుడు గ్రాండ్ మదర్ కూడా అయిపోయింది. ఇన్నాళ్ళూ తన పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చెయ్యడంలో అలిసిపోయిన జానకి ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ ని కలిసినప్పుడల్లా తనూ ఒకచిన్న పిల్ల అయి వాళ్ళతో ఆడుకుంటూ ఆనందిస్తుంది. అందరిలోకి జానకి ఊహకు భిన్నంగా పెద్దవాడి కూతురు నికోల్ జానకిని చూస్తే చాలు వదిలిపెట్టదు. నాలుగేళ్ళు నిండిన నికోల్ జానకి ఏం చేసినా కుతూహలంగా చూస్తూ యక్ష ప్రశ్నలు వేస్తూ వుంటుంది.
అప్పటివరకూ తన చుట్టూ తిరుగుతున్న నికోల్ వున్నట్టుండి మాయమయ్యేసరికి జానకి గాబరాగా వెకతడం మొదలు పెట్టింది. కింద ఎక్కడా కనిపించక గబగబ పైకి వెళ్ళింది జానకి. అడుగుల చప్పుడు విన్న నికోల్ పరిగెత్తుకుంటూ జానకి దగ్గరకు వచ్చి పట్టు చీరలో, నుదుట కల్యాణం బొట్టుతో, పువ్వుల జడతో, చేతుల నిండుగా గాజులు, నగలతో తెలుగుతనానికి ప్రతీకగా వున్న జానకి ఫొటో చూపించి 'who is this gradma? shi is pretty?' అని అడిగింది. నికోల్ మనస్తత్వం తెలిసిన జానకి ఆ ఫోటో గురించి, ఆనాటి ముస్తాబు గురించి వివరంగా చెప్పింది. అంతా విన్న నికోల్ ఫోటోలో వున్న జానకి వేపు వేలు పెట్టి చూపిస్తూ 'I want to grow up and look just like her' అంది.
జానకి మొహం ఒక్కసారిగా ఆనందం, ఆశ్చర్యం మిళితమైన కాంతితో వెలిగిపోయింది.
నికోల్ వెంటనే తల పైకెత్తి జానకి మొహంలోకి సూటిగా చూస్తూ 'you look so different. why did you change grandama'? అంటూ అమాయకంగా ప్రశ్నించింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|