|
|
Articles: Short Stories | పండుగ - Site Administrator
| |
ఏమండీ పండగ దగ్గరకొస్తుంది. మన పిల్లలను రమ్మని ఫోన్ చేయండి అన్నది భర్తతో ఆనవాయితీగా..
ఫోన్ చేశాను. వాళ్ళు పండగ రోజుకి వస్తామన్నారు అన్నాడాయన.
అదేమిటీ... ముందుగా రావడం లేదా? అన్నది కమలమ్మ.
అమ్మాయేమో అల్లుడుగారు ఏదో క్యాంపులో ఉన్నారు, ఆయన వస్తే వస్తాం అంది. అబ్బాయేమో పిల్లలకి పరీక్షలు, ముందుగా రావడం కుదరదు అన్నాడు.
అంతేలే... పిల్లలు పెద్ద చదువుల్లోకి వస్తున్నారు కాద! అని సరిపెట్టుకుంది.
పండగ రోజు రానే వచ్చింది. కూతురు కుటుంబం వచ్చింది, కొడుకు కుటుంబం రాలేదు.
కొడుకు, కోడలు రాని వెలితి కనిపిస్తూనే ఉన్నా, తన అసంతృప్తిని బయటపడకుండా కూతురు, పిల్లలతో కాలక్షేపం చేస్తోంది ఆవిడ.
అయితే...
ఇదివరకురోజుల్లో కూతురు, కోడలూ ఒకేసారి రావడంతో తను కూతురుతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కోడలు అన్ని పనులూ చక్కబెడుతూండడంతో ఆవిడకు తెరిపిగా ఉండేది.
ఇప్పుడేమో కోడలు రాలేదు. కూతురు కూడా పుట్టింట్లో విశ్రాంతి తీసుకోటానికొచ్చినట్లుగా ప్రవర్తిస్తూండడంతో అన్ని పనులూ తనే చేయవలసి రావడంతో ఆవిడకు అలసటగా అనిపిస్తోంది.
అదేమిటమ్మా అన్నయ్యా వాళ్ళు రాలేదా అన్నకూతురితో లేదమ్మా, అన్నయ్య వాళ్ళ పిల్లలకు పరీక్షలంటమ్మా అని సమాధానం చెప్పింది.
మన పిల్లలకేనా పరీక్షలు లేనిది? నేను చెప్పినా వినకుండా బయలుదేరావు అన్నాడు అల్లుడు.
దానితో కూతురు చిన్నబుచ్చుకుంది. ఒక పక్క కొడుకు, కోడలు రాని వెలితితో బాధగా ఉన్నా, కూతురు కుటుంబం రావడంతో సర్ది చెప్పుకుని పోనీలే మీరయినా వచ్చారు అంటూ మనస్ఫూర్తిగా మెచ్చుకుంది.
అమ్మా... పండక్కి ఏం చేసుకుందామే అన్న కూతురు మాటలకి కమలమ్మ చెప్పిన వంటకాలు నచ్చక అమ్మా ఇవ్నీ మీ అల్లుడుగారు తినరే అంది.
చివరకు భర్తకు ఇష్టమైన వంటకాల వివరాలు చెప్పింది. కానీ అవి తయారుచేయడంలో తల్లికి కొంచెం కూడా సాయం చేయలేదు. పైగా అమ్మా ఆయనకు ఆవిధంగా చేస్తే నచ్చదు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూ తల్లికి పనిభారం పెంచింది.
ఆ చిరాకులో ఏమిటే... ఇవన్నీ కొత్తగా ఎక్కడ నేర్చుకున్నావు? అంటూ కసురుకుంది కూడా. తర్వాత అయ్యో పాపం అనవసరంగా నోరు చేసుకున్నానే అని బాధపడింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|