|
|
Articles: Short Stories | దొరబాబు దూరదర్శిని - Site Administrator
| |
ఈ విషయంలో ఆఫీసులో అందరికీ తెలిసిందనీ, దాన్ని తలచుకుని రోజుల తరబీ మేమంతా నవ్వుకున్నామనీ వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. ఇలాంటి అలవాట్లున్న దొరబాబు వల్ల మాకందరికీ వినోదమూ, విజ్ఞానమూ తప్ప వేరే హాని లేకపోవడం చేత గత జూన్ లో మా ఆఫీసులో క్రొత్తగా చేరిన కొద్ది రోజులకే అతనో ప్రముఖ వ్యక్తి అయిపోయాడు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారం వచ్చేసరికి మాకందరికీ ఆసక్తి పెరిగింది. ఎందుకంటే టీవీనీ విపరీతంగా చూసే దొరబాబు టీవీ టర్నాఫ్ వీక్ ని ఎలా గడుపుతాడా అని.
ఎప్పుడైనా ఎయిడ్స్ వాక్ అనో, బ్రెస్ట్ క్యాన్సర్ రన్ అనో, ఆస్తమా అవేర్నెస్ ఫండ్ రెయిజర్ అనో పోస్టర్ గానీ, ప్రకటన గానీ కనబడితే దాని గురించి ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ, వాటి విజయనికి తన వంతు కృషి చేస్తూ హడావిడి చేసే దొరబాబూ 'డోంట్ లెట్ లైఫ్ పాస్ బై యు' అన్న దూరదర్శినీ రహిత వారోత్సవాల ప్రకటనలు కనబడటం మొదలైనప్పటినుంచీ తెగ చిరాకు పడుతున్నాడు. 'అదేమయ్యా, ఆరోగ్యం అంటూ కందమూలాలూ, కషాయాలూ రోజుల తరబడీ త్రాగి ఆయా ఉత్సవాల విజయానికి ఇతోధికంగా పాటు బడ్డ నీకు ఒక్కవారం పాటు టీవీ కట్టెయ్యడం కష్టమా?' అంటే, 'అవన్నీ ఒకెత్తు' అంటాడు. ఆ 'ప్రాపంచిక విషయాలూ, వాతావరణం సూచనలూ, వగైరాలన్నీ తెలియక పోతే ఇబ్బంది కాదూ' అంటాడు. ఆ విషయాలు తెలియాలంటే రేడియోలూ, న్యూసు పేవర్లూ, ఇంటర్నెట్లూ లేవూ. ఒక వారం పాటు ఈ విషయాలు తెలియకపోయినా మునిగిపోయే కొంపలేమీ లేవు. కానీ ఆ మాట మనం అంటే ఒప్పుకోడు.
అసలు విషయం ఏమిటంటే మనవాడికి అపరాధపరిశోధనకి సంబంధించిన షోలంటే యమ ఇష్టం. మూడు సీ.ఎస్.ఐఎస్, నంబర్స్, వగైరా వగైరాలన్నీ కడు ప్రీతితో చూసే మనవాడికి న్యూసూ, వెదరూ ముఖ్యమేమీ కాదు. అయితే ఆ విషయాలన్నీ బహిరంగంగా ఒప్పుకోడు. 'పోనీ ఇతర ప్రోగ్రాములన్నీ మానేసి కావలసినపుడు న్యూసూ, వెదరూ చూడూ' అంటే 'అలా చెయ్యడం మోసం చేసినట్టవదూ?' అంటాడు అసంతృప్తిగా. 'మరలాంటప్పుడు టి.వీ. అంటే, అంతగా ఇష్టపడే వాడివి శుభ్రంగా చూస్తే పోలా' అంటే 'ఇన్ని రకాల దినాల్నీ, వారాల్నీ నెలల్నీ అబ్జర్వ్ చేసిన వాడిని దీన్ని చెయ్యకపోతే నామోషి కాదూ' అంటాడు. 'సరే ఆ వారంలో అధిక భాగం నేనూ ఎటూ ఊళ్ళో ఉండనుగా, నాకెందుకులే, నీ కష్టాలేవో నువ్వు పడు' అని వూరుకున్నాను.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|