|
|
Articles: Short Stories | అనగా అనగా... - Site Administrator
| |
(ఫణి డొక్కా)
అమ్మలు : డాడీ డాడీ కథ చెప్పు
అతను : ఏం బంగారూ, నిద్ర రావటం లేదా?
అమ్మలు : అవును డాడీ
అతను : సరే, అయితే, యిలాదా... ఆ తలగడా తెచ్చుకుని నా వొళ్ళో బజ్జో... కథ చెబుతాను.
అమ్మలు : సరే డాడీ...
అతను : అమ్మలుకి ఏం కథ కావాలీ? రాజుగారూ, రాకమారుడూ కథ కావాలా?
అబ్బాయి : ఆ 'ఖత' నిన్ననే చెప్పావు డాడీ...
అతను : ఆరి పిడుగా! నువ్వుకూడా లేచే వున్నావా? 'చాక్లెట్' కొనలేదని కోపం వచ్చి ఏడింటికే పక్క ఎక్కారుగా అబ్బాయిగారు. కోపం పోయిందా? నిద్ర రావట్లేదా?
అబ్బాయి : లేదు... కోపం కోపమే... ఖత... ఖతే..
అతను : సరే అయితే, నువ్వు ఇటు వైపు బజ్జో, ఇవాళ ఆవూ, పులీ కథ చెబుతాను.
అబ్బాయి : వద్దంటే వద్దు, ఆ కత అమ్మ ఎప్పుడో చెప్పేసింది
అతను : అయితే... దూడా, పులీ కథ వినండి
అబ్బాయి : బావుంది, బావుంది చెప్పు డాడీ
అమ్మలు : అబ్బా తొందరగా చెప్పు డాడీ...
అతను : అనగా అనగా ఒక చిన్న వూరు. ఆ వూర్లో వో చిన్నరైతు. ఆ రైతు దగ్గర ఒక ఆవూ, ఒక దూడా ఉన్నాయి. దూడ మెడలో చిన్న చిన్న గంటలు కట్టి... కాలికేమో మువ్వులు కట్టి, చక్కగా బొట్టు పెట్టి, ముస్తాబు చేసి దానితో ఆడుకునే వారు రైతు పిల్లలు. ఆ దూడ... చూడ్డానికెంత బావుండేదో.. ఆవుకేమో దూడంటే ప్రాణం. ఒక్క నిమిషం దూడ కనపడకపోతే, ఆవుకి చాలా భయం వేసేసేది. దూడ కోసం పొలం గట్టు మీదా, వూరిలోనూ... అన్ని చోట్లా వెతికేసేది. దూడకి పాలివ్వందే ఆవు ఏమీ తినేది కూడా కాదు.
అబ్బాయి : మరి పులి ఖత అన్నావు?
అతను : తొందరపడకూ, పులి కూడా వుంది కథలో
అమ్మలు : పులి అడవిలో వుంటుంది, కదూ డాడీ?
అతను : కరక్ట్ అమ్మలూ... గుడ్ గర్ల్... సరే ఇక వినండి. ఆ వూరిని ఆనుకొని ఒక పెద్ద అడవి. ఆ అడవిలో బోల్డన్ని జంతువులు. ఒక పులి కూడా అది... ఏం చేసేదీ? ఆహారం కోసం, ఒక్కోసారి అడవి చివరికి వచ్చేసేది. వచ్చీ... పొలం గట్లమీద మేసే మేకల్నీ, గొర్రెల్నీ తీసుకువెళ్ళి అడవిలో తినేసేది. అందుకనే, ఆవుకి అడవంటే చాలా భయం. రోజూ దూడకి చెప్పేదీ... ఎప్పుడూ మిగతా దూడలతో కలిసి వుండు. అడవి దగ్గరికి కూడా వెళ్ళకూ అని. కానీ దూడకి చాలా సరదాగా వుండేది. అడవిలో యేముందో చూడాలని. దానికి తోడు, రెండు మూడు మచ్చల దూడలుండేవి మందలో. అవి అప్పుడప్పుడూ వచ్చి చెబుతూ వుండేవి. అడవి యెంతో బావుంటుందనీ, అడవిలో... కావలసినంత ఆహారం వుందనీ, అవి మిగతా దూడలకి తెలియకుండా ఒకటి, రెండు సార్లు అడవిలోకి వెళ్ళివచ్చాయి. అందుకే గొప్పలు చెప్పేవి.
అమ్మలు : మరీ... పులి వాటిని తినేయలేదా డాడీ?
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|