|
|
Articles: Short Stories | పే పాల్ - Site Administrator
| |
కానీ, డిన్నర్ చేసేటప్పుడు వచ్చిన ఫోన్ 'పే పాల్' వాళ్ళ దగ్గర నుంచి.
ఇప్పటివరకూ తాము చెక్కుల రూపంలో పంపిన డబ్బుని వీలైనంత త్వరలో వాపసు ఇమ్మని. అలా ఇవ్వని పక్షంలో కలక్షన్ ఏజెన్సీకి డబ్బులు వసూలు చేసే బాధ్యతను అప్పగిస్తామనీను. కలెక్షన్ ఏజంటంటే కాబూలీవాడన్నమాట.
'కోర్టుకెడితే సరి! 'పే పాల్' వాళ్ళు నన్నో వెర్రివాజమ్మనుకుంటున్నారు. అసలు ముందు విలియం ఫాక్స్ కు ఫోను చేస్తే... అంతా ఆ కంపెనీయే చుసుకుంటుంది' అనుకున్నాడు గానీ, సురేష్ కు నిద్ర పట్టలేదు.
0-0-0
ఉదయం లేచేసరికి కాస్త ఆలస్యమైంది. అప్పటికే సుజాత నిద్రలేచి, కంప్యూటర్ ముందు కూర్చుని ఉంది. 'ఖర్మకాలి తనకంతా తెలిసిపోలేదు కదా' అనుకుంటూ, నెమ్మదిగా తన కంప్యూటర్ గదిలోకి వెళ్ళాడు.
అప్పటికే విలయం ఫాక్స్ కూ, సురేష్ కూ మధ్య నడిచిన ఈ మెయిల్స్ చూస్తోంది సుజాత.
'అసలిదంతా ఏమిటి?' అని అడిగింది సుజాత కోపంగా.
'నిన్ను సర్ ప్రైజ్ చేద్దామని ఇప్పటిదాకా చెప్పలేదు. రేపో, ఎల్లుండో చెబుదామనుకున్నా' నిజమే చెప్పాడు సురేష్. సుజాత ఏమీ మాట్లాడలేదు.
ఆమెకు బాగా కోపం వచ్చిందని గ్రహించి, ఇవ్వాళ కాకపోయినా రేపైనా తెలుస్తుంది కదా అనుకుని జరిగిందంతా చెప్పాడు.
'రాత్రి ఫోను పేపాల్ వాళ్ళ దగ్గర నుంచి. నా అకౌంటులో సాఫ్ట్వేర్ కొనడానికి ఉపయోగించిన క్రెడిట్ కార్టులన్నీ దొంగలించబడ్డ క్రెడిట్ కార్డులట... అందుచేత క్రెడిట్ కార్డు కంపెనీలు 'పేపాల్' వాళ్ళకు డబ్బివ్వమంటున్నారట. దాంతో పేపాల్ వాళ్ళు ఇప్పటి వరకు నాకు పంపిన డబ్బంతా వాపసు ఇవ్వమంటున్నారు' చెప్పాడు సురేష్.
'మొత్తం ఎంత కట్టాలి?' అడిగింది.
'దాదాపు నలభై అయిదు వేలు... కమీషన్ రూపంలో నాకొచ్చింది కలిపితే యాభై వేలు.... చెప్పాడు నేల చూపులు చూస్తూ.
'దొంగ క్రెడిట్ కార్డులన్నప్పుడు, పేపాల్ వాళ్ళు అసలెందుకు యాక్సెప్ట్ చేశారు' అడిగింది.
'అప్పటికి అవి దొంగ కార్డులని తెలియదు కదా. దీనంతటికి క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్ళే బాధ్యత వహించాలి' చెప్పాడు సురేష్.
'మరిప్పుడు మనమేం చేయాలి' అడిగింది సుజాత.
నేను విలియం ఫాక్స్ కు ఫోను చేసి మెసేజీ పెట్టా. ఈ మెయిలు కూడా పంపా. అయినా మనమంత వర్రీ కావాల్సిన పని లేదు' చెప్పాడు సురేష్.
'ఎవరినైనా లాయర్ని కలుద్దాం పదండి' అంది సుజాత.
'లాయరెందుకూ... వాడికిచ్చే ఫీజు వేస్టు...' అని కాస్సేపు నసిగినా, చివరకు బయలుదేరాడు... భార్యను శాంతపర్చడానికి అన్నట్లు.
0-0-0
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|