|
|
Articles: Short Stories | పే పాల్ - Site Administrator
| |
రెండు గంటల్లో రిప్లయి వొచ్చింది
'నా పేరు విలియం ఫాక్స్. నేను జెకస్లోవేకియాలోని లెస్ క్రైమ్ సాఫ్ట్ ఇంక్ అనే కంపెనీకి ప్రతినిధిని. మా కంపెనీ కంప్యూటర్ నేరాలను నివారించే సాఫ్ట్వేర్ ను తయారు చేస్తుంది. మాకు అన్ని దేశాలలో కస్టమర్లు ఉన్నారు.... ముఖ్యంగా ఉత్తర అమెరికా కస్టమర్లు మా సాఫ్ట్వేర్ కొన్నప్పుడు సాధారణంగా డబ్బును క్రెడిట్ కార్డుతో చెల్లిస్తారు. కాబట్టి మాకు 'పే పాల్' సాఫ్ట్వేర్ ను ఉపయోగించడంలో అనుభవమున్న వారు కావాలి. చట్టపరమైన కొన్ని నిభందనల వల్ల మా దేశంలో పేపాల్ ఉపయోగించడానికి అనుమతి లేదు. కాబట్టి జెకస్లోవేకియా బయట నివసిస్తూ, కష్టమర్ల నుంచి వచ్చిన డబ్బును 'పే పాల్ ద్వారా స్వీకరించి, పది శాతం కమీషన్ మినాహాయించుకుని, మిగిలిన నిధులను మాకు పంపడానికి మధ్యవర్తులు కావాలి. సదరు ఔత్సాహికులు పేపాల్ ఖాతాకు సంబంధించిన వ్యవహారాలను తమంతతామే నిర్వహించుకోవాలి. ఖాతా వివరాలను కంపెనీకి అందజేయాలి. ఇంతకు మునుపు చెప్పినట్లుగా కొన్ని చట్టపరమైన కారణాల వల్ల 'పేపాల్ వ్యవహారాలలో కంపెనీ జోక్యం చేసుకోదు. ఆసక్తి వుంటే సంప్రదించండి' అదీ సారాంశం.
'కంపెనీవాడు మనల్ని పైసా కూడా అడగటం లేదు. పై పెచ్చు ముందు డబ్బు మన చేతికే వస్తుంది. మన కమీషన్ మనం వుంచుకుని, మిగిలిందే కదా కంపెనీకి పంపేది. వారానికి తొమ్మిది వేలు కాకపోయినా... హీనపక్షం రెండొందల డాలర్లొచ్చినా చేదుకాదుకదా! అని వెంటనే విలియం ఫాక్స్ కు ఇ-మెయిలు పంపాడు.
తర్వాత పనులన్నీ చకచకా రెండు రోజుల్లో జరిగిపోయాయి. సురేష్ తన పేరు మీద 'పేపాల్' అకౌంట్ ఓపెన్ చేశాడు. లెస్ క్రైం కంపెనీవాళ్ళు మోసం చేసే అవకాశాలు కనిపించకపోవడంతో 'పే పాల్ ' వాళ్ళకు తన క్రెడిట్ కార్డును, బేంకు అకౌంటును గేరంటీగా ఇచ్చాడు.
విలియం ఫాక్స్ 'కంగ్రాచ్యులేషన్' చెప్పడానికి కాల్ చేసి అడిగినప్పుడు 'పే పాల్' అకౌంటు వివరాలను చెప్పాడు.
చెయ్యాల్సిన పని పెద్ద కష్టంగా అనిపించలా. కుదిరినప్పుడు 'పే పాల్' అకౌంటుకెళ్ళి ఎంత డబ్బుందో చూసుకోవడమే! ఇంత చిన్న పనికి పది శాతం కమీషన్ ఇచ్చేది... ఈ తెలివి తక్కువ తెల్లవాళ్ళే అనుకున్నాడు.
భార్యకు ఈ విషయం చెబుదామా వద్దా అని ఆలోచించాడు. ఇప్పుడు చెబితే ఏదో అడ్డు పుల్ల వేస్తుందని, ఒక నెల రోజుల తర్వాత సంపాదించిన డబ్బు చూపించి ఆశ్చర్యపరచొచ్చనీ అనుకున్నాడు.
తర్వాత రోజు నుంచీ పని ప్రారంభించాడు. మొదటి రెండు రోజులూ ఏమీ ఆర్డర్లు రాకపోయినా, తర్వాత ఒకటీ, రెండూ రావడం మొదలైంది.
మొదటి రెండు వారాల్లో దాదాపు పదిహేను వేల డాలర్లు సురేష్ ఖాతాలో జమయ్యాయి. అంటే కమిషన్ కింద 1500 డాలర్లు సురేష్ కు దక్కుతాయి. డబ్బు సంపాదించడం ఇంత ఈజీనా అని చాలా ఆశ్చర్యపోయాడు. ఈ రకంగా ఆర్డర్లు వస్తే, తనిప్పుడు చేస్తున్న ఉద్యోగాన్నొదిలేసినా ఫర్లేదనుకున్నాడు.
ఆ వీకెండులో చలపతి వాళ్ళింట్లో చిన్న పాట్ లక్ పార్టీకి వెళ్లినప్పుడు, తను చేస్తున్న ఈ సైడు బిజినెస్సు గురించి ఎవరికీ చెప్పకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి వొచ్చింది.
సాధారణంగా ఎవరితోనూ పెద్దగా మాట్లాడనిసురేష్, ఆ వారమే ఉద్యోగం పోగొట్టుకుని ఉసూరుమంటూ కూర్చున్న సుబ్బారావుకు ఎన్నో ధైర్యవచనాలు చెప్పాడు. తీరిగ్గా తననొకసారి కలిస్తే డబ్బు సంపాదించే మార్గం చెబుతానని చెప్పాడు. 'కష్టాల్లో ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళం ఆదుకోకపోతే ఎలా?' అని అన్నాడు.
తర్వాత వారం సురేష్ పేరు మీద మరో ముప్ఫై అయిదు వేలకు చెక్కొచ్చింది, పేపాల్ కంపెనీ నుంచి. అంటే ఇప్పటి వరకు తనకొచ్చే కమిషన్ అయిదు వేలు!
ఇంకా పొంగిపోయాడు సురేష్. మూడు వారాల్లో ఒక గంటపాటు, ఈ మెయిలు, పేపాల్ అకౌంటు చూసుకుంటూ ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుంటే ఇంత డబ్బా అనుకున్నాడు. దీన్లో ఏమీ మోసం లేదుకదా అని ఆలోచించాడు. కానీ ఎదురుగా అంత డబ్బు కనిపిస్తూండడం, అదీ తన అకౌంటులోనే ఉండడం వల్ల... 'అబ్బా అలా ఎందుకు మోసం చేస్తారులే' అనుకున్నాడు. లోకమంతా మంచిగా కనిపించింది.
ఆకౌంటులో యాభై వేలుంది కదా... దీన్నంతా తీసుకుని, పారిపోతే ఎలా వుంటుందీ అనుకున్నాడు. బంగారు బాతు గుడ్డు కథ గుర్తొచ్చింది. వారం వారం ఇంతింత డబ్బొస్తొంటే... కక్కుర్తిపడి మూడువారాల డబ్బుతో పారిపోవడం తెలివితక్కువ పని అనుకున్నాడు వెంటనే తన కమిషన్ డబ్బు తనుంచుకుని, మిగిలిన డబ్బును కంపెనీకి వైర్ ట్రాన్స ఫర్ చేశాడు.
ఇంకో రెండు మూడు రోజుల్లో, తను చేస్తోన్న పని గురించి భార్యకు చెప్పి ఆశ్చర్యపరుద్దామనుకున్నాడు.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|