|
|
Articles: Short Stories | సామాన్యుడి కోరిక - Site Administrator
| |
'స్వామీ.... నేను ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. మా తండ్రి గారి మీదనే ప్రత్యర్థిగా నిలబడి పోటీ చేస్తున్నాను. 'దైవ స్వరూపులైన తండ్రిగారి మీదనా... నీ పోటీ' అని కోప్పడతారేమో తమరు. అలా నన్ను మందలించే అధికారం తమకెప్పుడూ ఉంది. కానీ దానికి వినయంగా నేను చెప్పుకుంటున్న సమాధానం ఆలకించండి స్వామీ... నాన్నగారు ఇంతకు ముందెన్నో ఎన్నికల్లో నెగ్గి, ప్రజల కోసం అహరహం శ్రమించి ఎంతో సేవ చేశారు. అలాగే మా ఆస్థులు కూడా బాగా పెంచారనుకోండి. ఆ విషయం మీకు మాత్రం తెలియదా? ఆయన వయసూ పైబడింది. ఆరోగ్యమూ అంతంత మాత్రమే. ఇంకా ఈ రాజకీయాలెందుకండీ మీకు... విశ్రాంతిగా కాలం గడుపుకోండి... అంటే వినడం లేదు. అందుకే ఇలా నేను నిలబడవలసి వచ్చింది. ఆయన ఓటమి పాలైతేనన్నా ప్రశాంతిగా విశ్రాంతి తీసుకుంటారని. ఈ నా ఉద్దేశాన్ని మన్నించి, నన్నుగెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను... అని రెండు చెంపలూ వాయించుకొని ఓ అరడజను గుంజీలు తీసి బయటకొచ్చాడు.
మరికొద్దిసేపటికి కొడుకుపై పోటీ చేస్తున్న ఆ తండ్రి గుడిలో ప్రవేశించాడు. అర్చకస్వామి స్వామివారికి దీపధూపానంతరం నైవేద్యం సమర్పించి, శఠగోపం తలపై ఉంచి, తీర్థ ప్రసాదాలందించి, అభ్యర్థిని ఒంటరిగా స్వామి ముందు వదిలి ప్రక్కకు వెళ్ళిపోయాడు.... మనసులో మాట భగవంతునికి విన్నవించుకోవడానికి వీలుగా. ఆ తండ్రిగారి కోరికేమిటో వినాలని ఉంది కదూ మీకు? మరి వినండి....
'అయ్యా.. దేవతలారా...' గర్భగుడిలో ఉన్నది ఒకే దేవతామూర్తి అయినప్పటికీ ఎందుకైనా మంచిదని అందరినీ సంబోధిస్తూ వేదిక మీద ఉపన్యాసం లెవల్లో కోరుకోవడం ప్రారంభించాడు.' నేను ఇన్నాళ్ళూ ప్రజల కోసం ఎంత శ్రమపడ్డానో... ఆలాగే నా కోసం కూడా అనుకోండి... మీకు తెలియంది కాదు. ఇప్పుడు నాకు పోటీగా నా కొడుకు నిలబడ్డాడు. ఇదేంటిరా అంటే 'నువ్వు ముసలోడివైపోయావు. ఇంకా నువ్వే కుర్చీ పట్టుకువేళ్ళాడితే నేనెప్పుడెక్కాలి' అంటాడు. ఆ కుర్రసన్నాసికేం తెలుసు స్వామీ నా సత్తా? ఎవణ్ణి ఎప్పుడు ఎలా నొక్కాలో... సొమ్ములు ఎట్టా నొల్లుకోవాలో ఆడికేం తెల్సు? ఆవేశం తప్ప ఆలోచనలేని పీనుగ. నేనంటే ఆ అధికార పక్షమోళ్ళకి హడలు. మరొకరెవరైనా అయితే నా మీద నెగ్గడం కష్టం. అందుకే నా కొడుకుని నా మీదకు ఎగదోశారు. పిచ్చి సన్నాసి... అమాయకుడు... ఆణ్ణి కాదు గానీ నా మీద దయచూపించండి సామీ.. మరి వెళ్ళొస్తా సామీ...' అంటూ గుడి బయటకు వచ్చేశాడు అతగాడు.
అరె.. ఆవిడెవరో మరీ ఆర్భాటంగా వస్తోంది చూడండి... ఆవిడ కేంద్రంలో ప్రభుత్వ పార్టీని బలపరుస్తున్న రాష్ట్రంలోని అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోందిట! చూడండి... మరీ కలికాలం కాకపోతే ఆవిడ కేంద్రంలో ప్రభుత్వ పార్టీని బలపరుస్తున్న రాష్ట్రంలోని అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తోందిట! చూడండి... మరీ కలికాలం కాకపోతే... ఆవిడ భర్త మీదనే పోటీకి దిగిందట. అదిగో ఆలయ అర్చకులు ఆవిణ్ణి ఒక్కతినీ దేవుడి ముందు వదిలి పక్కకి వచ్చేశారు. అప్పుడే ఆవిడ తన కోర్కెల దండకం మొదలుపెట్టేసింది. విందాం రండి మరి!
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|