|
|
Articles: TP Features | 'తెలుగు'పై పార్టీల ప్రేమ! - Site Administrator
| |
ఇంత చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం తెలుగు కోసం ఏం చేసిందో ఏమీ చెప్పలేదు. తెలుగు అనే మూడక్షరాల మాట గానీ, భాష అనే రెండక్షరాల మాట గానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వెతికినా కనిపించలేదు. ప్రజల భాషలో పరిపాలించాలనే ప్రాథమిక విషయాన్ని గురించి ప్రస్తావించనేలేదు. దీనితో అధికారభాష తెలుగు అమలు విషయంగాని, 'ఎల్లెడలా తెలుగు వెల్లివిరియాల'న్న ముఖ్యమంత్రి గారి మాటలకు గాని విలువే లేకుండా పోయింది. కనీసం ఒక పాఠ్యాంశంగానైనా తెలుగును బోధిస్తున్నామని, జి.ఒ.నెం.86/2003 పట్ల నిబద్ధంగా ఉన్నామని చెప్పలేకపోయింది. ప్రజల భాష పట్ల, తెలుగుజాతి పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో స్పష్టం అయింది.
ఇక తెలుగుదేశం పార్టీ సంగతి. ఆంధ్రప్రదేశ్ లో తాము పరిపాలించిన కాలంలో తెలుగుభాషా సంస్కృతుల పరిరక్షణ కోసం తామేం చేసిందీ చెప్పుకోవడానికి సిగ్గుపడి మాటల్ని దాచేసింది. 'అన్నగారి' హయాంలో చేసిందయినా జ్ఞాపకం రాలేదో, ఇష్టంలేదో మరి! ఇక ఇప్పుడు అధికారంలోకొస్తే ఏమి చేయదలచిందీ కూడా చెప్పడానికి తిరస్కరించింది - పోనీ - పట్టించుకోలేదనుకోవాలి. రాష్ట్రానికి సంబంధించి - పరిపాలన, బోధన రంగాల్లో తెలుగు సంగతే మరచిపోయింది. తమ పార్టీ పేరులో 'తెలుగు' ఉంది గనుక, ఇతర దేశాల్లోని తెలుగు సంఘాలతో తెలుగు బోధనలో అసోసియేషన్లతో కలిసి పనిచేస్తామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని - మేనిఫెస్టోలో ప్రకటించుకొంది. అంతేకాదు, విదేశాల్లోని తెలుగు అసోసియేషన్లకు రాష్ట్రప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధత కల్పిస్తామని రాసుకొంది. చూడండి!
సొంత రాష్ట్రంలో, బయటి రాష్ట్రాల్లో తమ ప్రజల భాషా సంస్కృతుల పట్ల తమకెంత మాత్రమూ ఆసక్తిలేదనీ, తమ ప్రేమ 'ప్రవాసాంధ్రుల' మీదేనని ప్రకటించుకొన్న నేటి ప్రధాన ప్రతిపక్షం - అధికారంలోకి రావాలని సర్వశక్తుల్నీ ఒడ్డుతున్న తెలుగుదేశం పార్టీ నిజాయితీకి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?!
'ఒక జాతీయపార్టీ'గా కాంగ్రెస్ తెలుగుజాతి, తెలుగుభాష అనే మాటల్ని విస్మరించింది! తెలుగు ప్రజల కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ తన మూలాలనే మరచిపోయింది!
ఇక అధికారంలోకి రావాలని పట్టుదలగా కృషి చేస్తున్న కొత్త పార్టీ 'ప్రజారాజ్యం' పార్టీ - అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. ఆ పార్టీని నమ్మడానికీ నమ్మకపోవడానికీ ఏ కారణాల్నీ వెతుక్కోలేం. వారి ఎన్నికల ప్రణాళిక మాత్రం మంచి వాగ్దానాలే చేసింది. గమనించండి :
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|